అమెజాన్‌లో అదరగొడుతోన్న రామ్ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్)

Update: 2024-03-26 12:54 GMT

దేశభక్తి సినిమాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. బలమైన కంటెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి. అలా రీసెంట్ గా థియేటర్స్ లో విడుదలైన సినిమా ‘రామ్’(ర్యాపిడ్ యాక్షన్ మిషన్). సూర్య అయ్యలసోమయాజుల, ధన్య బాలకృష్ణ జంటగా నటించిన సినిమా ఇది. దీపిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఓఎస్ఎం విజన్ తో కలిపి ప్రొడక్షన్ నెంబర్ వన్ గా రూపొందిన ఈ చిత్రానికి మిహిరామ్ వైనతేయ దర్శకుడు.

మొదటి సినిమానే అయినా అటు హీరోకి, ఇటు దర్శకుడికి రామ్ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్) మంచి పేరుని తీసుకొచ్చింది. థియేటర్లో ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దేశ భక్తిని చాటే చిత్రమే అయినా అన్ని రకాల అంశాలను, ఎమోషన్స్‌ను కలగలిపి తీయడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. మ్యూజిక్, ఆర్ఆర్, కెమెరావర్క్ ఇలా అన్ని క్రాఫ్ట్‌లకు మంచి గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే.

అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ అందరినీ ఆకట్టుకుంటోంది. అమెజాన్‌లో ఈ మూవీకి మంచి ఆదరణ దక్కుతోంది. థియేటర్లో మిస్ అయిన వారంతా ఈ దేశ భక్తి సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో చూడొచ్చు.

Tags:    

Similar News