ప్రముఖ తెలుగు నిర్మాత అల్లు అరవింద్ రామాయణం చిత్రాన్ని నిర్మిస్తారని కొన్ని రోజులగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్.. మధు మంతెన, బాలీవుడ్ ఫిలీం మేకర్ నితేష్ తివారితో కలిసి దాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. అయితే సరైన నటీనటుల దొరక్కపోవడంతో చిత్రం లేట్ అవుతున్నట్లు టాక్. అయతే ప్రస్తుతం రామాయణం ప్రాజెక్టు నటీనటులందరూ ఓకే అయ్యారని వార్తలు వస్తున్నాయి. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా ఆలియా భట్, రావణాసురిడిగా కేజీఎఫ్ నటుడు యశ్ ను ఎంపిక చేసినట్లు గుసగుసలు వినిపించాయి. సీత పాత్ర కోసం అలియాభట్‌కు లుక్ టెస్ట్ పూర్తైనట్లు తెలుస్తోంది అయితే యశ్ మాత్రం రామాయణంలో నటిస్తున్నారనే వార్తలను ఖండించాడు. ఇక ఈ దీపావళికి రామాయణం అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ చేస్తారని టాక్. అన్ని సవ్యంగా జరిగితే ఈ ఏడాది డిసెంబర్ లో ఈ సినిమా షూటింగ్ మొదలవనుంది.
తాజాగా ఈ ప్రాజెక్టుపై రామాయణం నటుడు సునీల్ లహ్రీ స్పందించారు. రణబీర్ కపూర్, ఆలియా భట్ రాముడు, సీత పాత్రలకు బాగా సూట్ అవుతారని తెలిపారు. వాళ్లిద్దరు కచ్చితంగా కథకు న్యాయం చేస్తారన్నారు. రాముడి పాత్రకు రణ్‌బీర్ సరిపోతాడని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
" అలియా భట్ టాలెంటెడ్ నటి. కానీ, గతంలో ఈ తరహా పాత్రలు చేసి ఉంటే సీత పాత్రకు మరింత న్యాయం చేయగలదని నా అభిప్రాయం. గత కొన్నేళ్లలో అలియాలో ఓ నటిగా చాలా మార్పులు వచ్చాయి. మరి సీతగా ఎలా అలరిస్తుందో చూడాలి’’ అని అన్నారు.
రామాయణ ఇతిహాసం ఆధారంగా ఇటీవల ఆదిపురుష్ సినిమా వచ్చింది.ప్రభాస్, కృతిసనన్ జంటగా నటించారు. ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ భాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. అంతేకాకుండా బోలెడు వివాదాల్లో చిక్కుకొని ఇబ్బందులు ఎదుర్కొంది.