ఆలియాతో రణబీర్ విడిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు-కంగనా

Update: 2023-07-19 04:50 GMT

బాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్...కాంటవర్శీ క్వీన్ ఎవరు అంటే అందరూ టక్కున చెప్పే పేరు ఒక్కటే...అదే కంగనా రనౌత్. కొంతకాలంగా కామ్ గా ఉన్న కంగనా ఇప్పుడు మళ్ళీ పెద్ద కాంట్రవర్శీకి తెరతీసింది. కంగనా సినిమా ఒకటి రిలీజ్ కు సిద్ధంగా ఉంది. దీనిమీద ఒక వర్గం నెగటివ్ కామెంట్స్ చేసింది. వాటి మీద స్పందించిన కంగనా...పనిలో పనిగా రణబీర్, ఆలియాల మీద సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

అదేంటో తెలియదు కానీ తాను ఎప్పుడు ఏ కొత్త సినిమా ప్రకటించినా విపరీతంగా నెగటివ్ ప్రచారం జరుగుతుంది. అన్ని పేపర్లలో ఒకటే హెడ్ లైన్ ఉంటుంది. దీన్నే బల్క్ మాస్ మెయిల్ అంటారు. నన్ను చూసి బాధపడితే మిమ్మల్ని ఆ దేవుడే రక్షించాలి అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది కంగనా. ఇలా నా మీద దుష్ప్రచారం చేసిన చెంగుమంగు గ్యాంగ్ కు ఒక్కటే చెబుతున్నా ...న్ను చూస్తే మీకు ఎందుకు అసూయ కలుగుతుందో చెప్పండి అంటూ నిప్పులు చెరిగింది.

పనిలో పనిగా రణబీర్, అలియాల మీద కూడా కామెంట్స్ చేసింది. రణబీర్ పెళ్ళి చేసుకుంది ప్రేమతో కాదు...మాఫియా డాడీ ఒత్తిడితోనే అంటూ చెప్పుకొచ్చింది. సినిమా ప్రమోషన్స్ కోసం, డబ్బుల కోసం పెళ్ళి చేసుకున్నారని ఆరోపించింది. ఫేక్ మ్యారేజ్ నుంచి ఇప్పుడు బయటపడడానికి ప్రయత్నిస్తున్నాడు. నా సహాయం అడుగున్నాడు, కలవమని ప్రాధేయపడుతున్నాడు అంటూ రాసుకొచ్చింది. ఒకే అపార్ట్ మెంట్లో వేరే ఫ్లోర్లలో ఎందుకు ఉంటున్నారు? ఫ్యామిలీ ట్రిప్ నుంచి భార్యా, పాప ఎందుకు దూరమయ్యారు అంటూ ప్రశ్నించింది. ఒకరి భర్త అయి ఉండి తనకెందుకు మెసేజ్ లు పెడుతున్నాడు, ఎందుకు కలవమని వేడుకుంటున్నాడు....అతను భార్య, పిల్లల మీద దృష్టి పెట్టాలి అంది కంగనా. ఇది భారత్, ఇక్కడ ఒకసారి పెళ్ళి అయితే దానికి కట్టుబడి ఉండాల్సిందే అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం కంగనా పోస్ట్ వైరల్ గా మారింది. ఇలా ఒక బాలీవుడ్ ఫేమస్ జంట గురించి బహిరంగంగా చెప్పడంతో జనాలు విపరీతంగా పోస్ట్ ను సర్క్యులేట్ చేస్తున్నారు.

Tags:    

Similar News