స్క్రీన్‌పై కనిపించేవన్నీ నిజాలు కావని, క్యారెక్టర్ పండించే క్రమంలో కో స్టార్స్‌తో కాస్త క్లోజ్‌గా ఉంటామని, అది వృత్తి ధర్మం అని ఢిల్లీ బ్యూటీ రాశీఖన్నా అన్నారు. చూసేవన్నీ నిజం అనుకుంటే ఎలా? అంటూ నెటిజన్స్‌పై ఈ అమ్మడు ఫైర్ అయ్యింది. హీరో సిద్దార్థ్ మల్హోత్రతో కలిసి రాశీఖన్నా యోధ మూవీ చేసింది. ఆ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకుంది. అయితే ఈ మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రతో ఈ బ్యూటీ చేసిన రొమాన్స్ వేరే లెవల్లో ఉంది. వీరిద్దరి స్క్రీన్ కెమిస్ట్రీపై బాలీవుడ్ మీడియాలో టాక్ నడుస్తోంది.
సోషల్ మీడియాలో అయితే ఈ జంట ప్రేమలో ఉన్నట్లు రాసేశారు. ఆ వ్యవహారంపై రాశీఖన్నా స్పందించింది. నెటిజన్లపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. తామిద్దరం ఇంట్రావర్ట్ అని, ఇద్దరివీ త్వరగా కలిసే మనస్తత్వాలు కావని, ఢిల్లీకి చెందిన వాళ్లం కాబట్టి కాస్త ఎక్కువగానే మాట్లాడుకునేవాళ్లం అని చెప్పింది. ఇదివరకూ తమకు పరిచయం కూడా లేదని, కెమెరా ముందుకు వస్తే మాత్రం క్యారెక్టర్‌కు న్యాయం చేయడం కోసం బాధ్యతగా నటిస్తామని చెప్పుకొచ్చింది.
యోధ మూవీలో కూడా అవసరం ఉన్నంత వరకే నటిస్తామంది. తెరపై తమ కెమెస్ట్రీ బావుందంటే, బయట కూడా అలాగే ఉంటామని కాదు..మా హద్దులు మాకుంటాయి..అంటూ నెటిజన్లకు ఘాటుగా రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం రాశీఖన్నా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.