దీపావళిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న విజయ్, రష్మిక

Update: 2023-11-13 08:20 GMT

దీపావ‌ళి పండుగని పురస్కరించుకొని చాలామంది టాలీవుడ్ స్టార్స్ తమ కుటుంబ‌స‌భ్యుల‌తో పండుగను గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఆ పండుగ వేడుక‌ల తాలూకు ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, జూ.ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, కొత్త పెళ్లికొడుకు వరుణ్ తేజ్, నితిన్ లు తమ కుటుంబ సభ్యులతో పండుగ జరుపుకున్న ఫోటోలను నెట్టింట అభిమానులతో పంచుకున్నారు. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ కూడా దీపావళి పండుగును బ్రైట్ ఫుల్ గా జరుపుకొని అందుకు సంబంధించిన ఫోటోలను ట్విటర్ వేదికగా విడివిడిగా షేర్ చేసుకున్నారు. కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు పెద్ద ఎత్తున్న చర్చ నడుస్తుండగా మరోసారి.. ఈ జంట దివాళి వేడుకలు నెటిజన్లకు పలు సందేహాలను రేకెత్తిస్తున్నాయి. విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో కలిసి ఈ పండుగను జరుపుకోగా రష్మిక కూడా ట్రెడిషనల్ లుక్‌లో దర్శనమిచ్చి అట్రాక్ట్ చేసింది.

Happy Diwali my loves ❤️✨ pic.twitter.com/XaPQwRR56O

— Vijay Deverakonda (@TheDeverakonda) November 12, 2023

అయితే ఈ పిక్స్ చూసిన సదరు నెటిజన్లకు కొత్త కొత్త డౌట్లను కలిగిస్తున్నాయి. విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఫోటోల్లో తన ఫ్యామిలీతో పాటు... ఇంటిని అందంగా బంతిపూలు, మామిడి ఆకులు, లైట్స్, దీపాలతో అలంకరించి ఉన్నాయి. ఇక రష్మిక ‘హ్యాపీ దీపావళి మై లవ్స్’ అంటూ చీరకట్టులో ఓ బెంచ్‌పై కూర్చున్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. నిమిషాల వ్యవధిలోనే వీరిద్దరూ ఆ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే రష్మిక షేర్ చేసిన ఫొటోల్లోనూ విజ‌య్ ఫ్యామిలీ ఉన్న ఇంటి లోకేష‌న్‌కు రష్మిక ఉన్న లోకేష‌న్‌ మ్యాచ్ అవుతుంది. ఈ రెండు పోస్ట్‌ల్లోని ఫొటోల్లో బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న గోడలు ఒకలాగే కనిపించాయి. అంతేకాదు గోడకు వేలాడదీసిని లైట్స్ డిజైన్స్ సేమ్ కనిపించాయి. దీంతో విజయ్‌ దేవరకొండ త‌న ఇంట్లో దీపావ‌ళి వేడుక‌లు రష్మిక వచ్చిందంటూ నెట్టింట పెద్ద చర్చ నడుస్తోంది.

Happy Diwali my loves ✨🤍 pic.twitter.com/2qE2xD9UNw

— Rashmika Mandanna (@iamRashmika) November 12, 2023


‘గీత గోవిందం’ సినిమాలో తొలిసారి కలిసి నటించిన ఈ జోడీ మొదటి సినిమాతోనే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’ తోనూ మెప్పించారు.

Tags:    

Similar News