అసిస్టెంట్ చేసిన పనికి రష్మిక షాక్.. (వీడియో)
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉంది రష్మిక మందన్న. షూటింగ్లలో ఎంత బిజీగా ఉన్న తన వ్యక్తిగత సిబ్బంది ఇండ్లలో జరిగే ఫంక్షన్లకు ఆమె తప్పక అటెండ్ అవుతుంటారు. ఈ క్రమంలో తాజాగా రష్మిక మేకప్ అసిస్టెంట్ పెళ్లి జరిగింది. ఆ మ్యారేజ్ కు వెళ్లిన రష్మిక పెండ్లి మండపంలో తన అసిస్టెంట్ చేసిన పనికి షాకైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
రష్మిక మేకప్ అసిస్టెంట్ సాయి బాబు వివాహం సెప్టెంబర్ 3న జరిగింది. వారి పెళ్లికి వెళ్లిన రష్మిక కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఊహించని విధంగా సాయిబాబా తన భార్యతో కలిసి రష్మిక కాళ్లు మొక్కాడు. ఊహించని ఈ పరిణామంతో కంగారుపడ్డ ఈ బ్యూటీ ఆ తర్వాత కొత్త దంపతులిద్దరినీ ఆశీర్వదించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను రష్మిక ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్న రష్మిక ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ అవకాశాలు అందుకుంటోంది. సందీప్ వంగా డైరెక్షన్ లో రణ్‌బీర్ కపూర్ హీరోగా రానున్న ‘యానిమల్’లో నటిస్తోంది. డిసెంబర్ 1న ఈ మూవీ రిలీజ్ కానుంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న ‘పుష్ప-2’లోనూ రష్మిక కనిపించనున్నారు. ‘రెయిన్ బో’ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో రష్మిక కనిపించనుంది.