Rashmika Mandanna:రష్మిక డీప్ ఫేక్ వీడియో కేసులో నలుగురు అరెస్ట్

Byline :  Veerendra Prasad
Update: 2023-12-20 05:34 GMT

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా (Rashmika Mandanna)కు సంబంధించిన ఓ మార్ఫింగ్‌ వీడియో కొన్ని రోజుల క్రితం ఇంటర్నెట్‌లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు సినీ, రాజకీయ సెలబ్రిటీలు స్పందింస్తూ... ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఏఐ ఆధారంగా తయారుచేసిన ఈ వీడియోపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. బ్రిటీష్ ఇండియన్, ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్‌ జరా పటేల్ కు చెందిన ఒరిజినల్ వీడియోను రష్మిక ముఖంతో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ వీడియో మార్ఫింగ్‌లో తన ప్రమేయం ఏమీ లేదని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. వీడియో చూసి తీవ్రంగా కలత చెందినట్లు చెప్పింది.

రష్మిక డీప్ ఫేక్ వీడియో ఘటనను సీరియస్‏గా తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆ నలుగురు ఈ వీడియోను అప్‌లోడ్ చేసినట్టు గుర్తించారు. అయితే నకిలీ వీడియోను తయారు చేసింది మాత్రం వీరు కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వీడియోను సృష్టించిన అసలు నిందితుల కోసం వెతుకున్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.

ఇదిలా ఉంటే.. ఇటీవలే యానిమల్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది రష్మిక. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ క్రేజ్ అందుకుంది రష్మిక. ప్రస్తుతం తెలుగు, తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉంది. అటు సినిమాలతో బిజీగా ఉంటూనే.. ఇటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది రష్మిక. ప్రస్తుతం ఆమెకు ఇన్ స్టాలో 4 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం రష్మిక పుష్ప 2, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాల్లో నటిస్తుంది.




Tags:    

Similar News