Rashmika Mandanna : నాకు అల్రెడీ పెళ్లయింది.. షాకింగ్ న్యూస్ చెప్పేసిన నేషనల్ క్రష్
పుష్ప సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిన నేషనల్ క్రష్ రష్మిక మందనా(Rashmika Mandanna.). ప్రస్తుతం వరస సినిమాలతో చాలా బిజీగా గడిపేస్తోంది. సినిమాల్లోనే కాకుండా.. మూవీ ఈవెంట్స్‌లో హాట్ హాట్ గా కనిపించే ఈ భామ.. తరచూ ఏదో ఓ వార్తలో హైలెట్ అవుతూనే ఉంటోంది. ఇక తన బాయ్ ఫ్రెండ్( జస్ట్ ఫ్రెండ్ మాత్రమే), హీరో విజయ్ దేవరకొండతో అప్పుడప్పుడు షికార్లకు వెళ్తుంటుంది. ముంబై వీధుల్లో పలుమార్లు మీడియా కంటపడ్డారు. డిన్నర్ నైట్స్, మాల్దీవ్స్ వెకేషన్స్ ఎంజాయ్ చేశారు. వీరు లవ్‌లో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ ఎన్నో రూమర్స్ వస్తుంటాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు మనసైన వాడు ఎవడో నేరుగా చెప్పింది ఈ కన్నడ భామ. ఆ వ్యక్తితో తనకు వివాహం కూడా జరిగిందని చెప్పింది.
ముంబైలో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కలిసి ఓ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న రష్మిక.. పెళ్లి ఎప్పుడు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు..నాకు ఎప్పుడో పెళ్లయిపోయిందని చెప్పి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. నాకు పెళ్లయింది ఎవరితోనో కాదు నరుటో తో.. అంటూ అందరూ నవ్వుకునే ఆన్సర్ ఇచ్చింది. అయితే నరుటో అంటే ఎవరో కాదు ఎంతో ఫేమస్ అయినటువంటి ఎనిమీ సిరీస్ లోని ఒక పాత్ర పేరు.ఇక ఈ పాత్రకి చాలామంది అభిమానులు ఉంటారు. అయితే అందులో రష్మిక కూడా ఒకరు కావచ్చు. అందుకే రష్మిక నాకు నరుటో తో పెళ్లయింది అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చింది. ఇన్ డైరెక్ట్ గా తాను సింగిల్ అని చెప్పింది.
ఇక కెరీర్ బిగినింగ్ లో హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించిన రష్మిక.. వ్యక్తిగత కారణాల వల్ల అతనికి గుడ్ బై చెప్పింది. నిశ్చితార్థం కూడా జరిగి.. కొద్ది రోజుల్లో పెళ్లి అనగా రష్మిక తన మనసు మార్చుకుంది. పెళ్లైతే సినిమా ఛాన్సులు మిస్ అవుతాయనుకుందో ఏమో .. ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. ప్రస్తుతం రష్మిక కెరీర్ పీక్స్ లో ఉంది. బడా బడా స్టార్స్ తో సినిమాలు చేస్తోంది. పుష్ప 2, యానిమల్ చిత్రాల్లో నటిస్తున్నది.