సడెన్‌గా రష్మిక ఇలా అయ్యిందేంటి.. పుష్ప-2 లుక్ లీక్

Byline :  Shabarish
Update: 2024-03-22 06:24 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ పుష్ప-2. హై స్టాండర్డ్ సినిమాటిక్ వ్యాల్యూస్‌తో ఈ మూవీ రూపొందుతోంది. పుష్ప పార్ట్1 బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు పార్ట్‌2 ఫాస్ట్ ఫాస్ట్‌గా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో పుష్పరాజ్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇది వరకూ రిలీజ్ అయ్యి భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. ఆగస్టు 15న రిలీజ్ కానున్న ఈ మూవీ నుంచి తాజాగా హీరోయిన్ రష్మిక లుక్ లీక్ అయ్యింది.

పుష్ప-2 మూవీ సెట్ నుంచి లీకైన రష్మిక లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైజాగ్‌లో ఈ మూవీ షూట్ జరుగుతోంది. శ్రీవల్లి క్యారెక్టర్ చేస్తున్న రష్మిక పుష్ప2లో తన లుక్‌ను మార్చేసినట్లు కనిపిస్తోంది. రెడ్ శారీలో ఒంటినిండా బంగారు ఆభరణాలు వేసుకుని రాయల్ లుక్‌లో రష్మిక కనిపిస్తోంది. అంటే పార్ట్1కు మించి పార్ట్2లో శ్రీవల్లి కనిపిస్తుందని తెలుస్తోంది.

రష్మిక లుక్ చూసిన ఫ్యాన్స్ మరింత జోష్‌తో శ్రీవల్లిని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే పుష్ప2 మూవీ భారీ యాక్షన్ సీన్స్‌తో తెరకెక్కుతోంది. పార్ట్‌2లో ఫహద్ ఫాసిల్, రావు రమేష్, సునీల్, అనసూయ క్యారెక్టర్స్ ఓ రేంజ్‌లో ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. 

Tags:    

Similar News