Rashmi Gautam : వారంతా నన్ను బలిచేశారు... రష్మీ తీవ్ర ఆవేదన ..
తెలుగు బుల్లితెర టాప్ యాంకర్స్ లో ఒకరిగా అభిమానుల నీరాజనాలు అందుకుంటుంది రష్మీ గౌతమ్. మొదట సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన రష్మీ .. అనుకోకుండా జబర్దస్త్ కామెడీ షోలో హోస్టింగ్ చేసే అవకాశం దక్కించుకుంది. జబర్దస్త్ షోలో ఎంట్రీ తర్వాత ఆమె కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఆ రోజు మొదలైన రష్మి దండయాత్ర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని హాట్ షోతో మతులు చెడగొడుతుంది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో ఈమె కెమిస్ట్రీ ప్రేక్షకులకు మరింత చేరువ చేసింది. అలాగే జబర్దస్త్ తర్వాత హీరోయిన్‌గా ప్రమోషన్ అందుకుంది. గుంటూరు టాకీస్ అంటూ అందాలను ఆరబోసింది. అయితే నటిగా అంతగా నిలదొక్కుకోలేకపోయింది. ఆమెకి సినిమా అవకాశాలు పెద్దగా రావడం లేదు. దీనిపై గతంలోనే రష్మీ క్లారిటీ ఇచ్చింది. అవి ఇప్పుడు వైరల్ గా మారాయి.
సినిమాల్లోని అవకాశాలు రాకపోవడం గురించి రష్మీ స్పందిస్తూ.. సినిమా ఇండస్ట్రీలో కు అవకాశాలు వచ్చాయి. అయితే రాత్రికి రాత్రే నా పాత్రలో ఇతరులు వస్తున్నారని చెప్పింది. బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ సాధించిన నువ్వు వెండితెరపై ఎందుకు సక్సెస్ సాధించలేకపోయావు అన్న ప్రశ్నపై స్పందిస్తూ రష్మి అలా రియాక్ట్ అయింది. అంతే కాదు .. తాను ఎన్నో మంచి అవకాశాలను కోల్పోయానని చెప్పుకొచ్చింది. సాధారణంగా ఇండస్ట్రీలో అందరికీ ఒక స్టాంపు ఉంటుంది. సెకండ్ హీరోయిన్ గా, ఇంకొందరు అక్క వదిన పాత్రలకు మాత్రమే సెట్ అవుతారనే స్టాంప్ ఉంటుంది. అలాగే.. నేను సినిమాలలోకి పనికిరానని.. కేవలం యాంకర్ గా మాత్రమే తాను సెట్ అవుతాననే స్టాంపు ఉండటం వల్లనే సినిమా అవకాశాలు రావడం లేదని వాపోయింది.ఇక తనకు ఎంతో మంచి పేరు తెచ్చి పెట్టిన టెలివిజన్ రంగాన్ని మాత్రం తాను ఎప్పటికీ వదులుకోనని రష్మి వెల్లడించింది. దీంతో రష్మీ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటె .. జబర్ధస్త్ ప్రోగ్రామ్‌తో వచ్చిన ఫేమ్‌ని గట్టిగా క్యాష్ చేసుకుంటోంది రష్మీ. పలు స్పెషల్ షోస్ కూడా చేస్తూ ఫుల్లుగా సంపాదిస్తోంది. రష్మి గౌతమ్ ఒక్కో షోకి భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుందని టాక్ ఉంది. అంతేకాక రష్మీ గౌతమ్ ఓ మనసున్న మంచి మనిషి అని చెప్పవచ్చు . జంతు ప్రేమికురాలిగా మూగ జీవాల సంరక్షణకు పాటు పడుతుంటుంది ఈ భూమ్మీది ఏ ఒక్క జీవిని మనుషులు బాధ పెట్టినా వెంటనే రియాక్ట్ అయి దాన్ని ఖండించడం రష్మీ నైజం. అయితే ఒక్కోసారి ఆమె చర్యల వలన విమర్శలు సైతం ఎదుర్కొంటుంది . అయినా సరే వాటిని దైర్యంగా ఎదుర్కొంటూ8 ముందుకు సాగుతుంది.