Ravi Teja Eagle: డేట్ గుర్తుపెట్టుకోండి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేందుకు వస్తున్నాడు
రవితేజ హీరోగా దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న సినిమా ‘ఈగల్’. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అభిమానుల్లో హైప్ క్రియేట్ చేసుకుందీ సినిమా. కాగా తాజాగా ‘ఈగల్’టీజర్‌ను మూవీ టీం విడుదల చేసింది. యాక్షన్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ అదిరిపోయింది. రవితేజ కొత్త గెటప్‌లో కనిపించనున్నారు. విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్స్, బీజీఎం ఆకట్టుకుంటున్నాయి. ఇందులో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, కావ్య థాపర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది (జనవరి 13 2024) సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ పవర్ ఫుల్ డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. టీజర్ లో సినిమాటోగ్రఫి అద్భుతంగా ఉంది. ఈ సినిమాతో రవితేజ మరోహిట్ కొట్టడం పక్కా అని అభిమానులు అనుకుంటున్నారు.