Tiger Nageswara Rao Trailer : కొట్టే ముందు, కొట్టేసే ముందు వార్నింగ్ ఇవ్వడం అలవాటు

Update: 2023-10-03 09:42 GMT

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. స్టువర్ట్ పురం అనే ప్రాంతంలో దొంగతనాలు చేసి ఫేమస్ అయిన ఓ వ్యక్తి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న ఈ మూవీకి వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ . తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు మూవీ టీమ్.

ముంబై లోని ఫన్ రిపబ్లిక్ మాల్‌లో ఈ ట్రైలర్ లాంచ్ జరిగింది. ట్రైలర్ లో తన మాస్‌ లుక్‌, డైలాగులతో రవితేజ ఆకట్టుకున్నారు. ఇప్పటికే పాటలతో అంచనాలు పెంచేసిన ఈ చిత్రబృందం తాజాగా ట్రైలర్‌తో మరింత ఆసక్తి కలిగేలా చేసింది. అక్టోబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ సినిమాను తెలుగు తో పాటు తమిళ , కన్నడ , హిందీ , భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు.

ట్రైలర్‌లో రవితేజ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్, ఫైట్స్ , విజువల్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉన్నాయంటున్నారు మాస్ మహారాజా ఫ్యాన్స్. సినిమా హిట్టవ్వడం పక్కా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇండియాలోని అతి పెద్ద దొంగగా పేరుగాంచిన స్టువర్ట్ పురం నాగేశ్వరరావు.. టైగర్ నాగేశ్వరరావుగా ఎలా మారాడు అన్నది ఇందులో చూపించబోతోన్నట్టుగా ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.ఈ సినిమాలో రేణు దేశాయ్ కీలక పాత్రలో నటించారు.

Full View


Tags:    

Similar News