జైలర్ సినిమాపై ఢిల్లీ హైకోర్ట్లో కేసు.. ఆ IPL టీం అభ్యంతరంతో..

Byline :  Bharath
Update: 2023-08-28 16:55 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా బాక్సాఫీస్ ను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ సినిమా 600 కోట్లను వసూలు చేసింది. మొత్తం పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది అనుకునే టైంలో.. ఢిల్లీ హైకోర్ట్ లో ఐపీఎల్ ఫ్రాంచేజీ కేసేసింది. జైలర్ సినిమాకు ఐపీఎల్ కు ఎంటి సంబంధం? హైకోర్ట్ లో కేసేంటని ఆలోచిస్తున్నారా. విషయం ఏంటంటే.. జైలర్ సినిమాలో హీరోపై ఇద్దరు విలన్లు అటాక్ చేస్తాడు. వాళ్లతో ఫైట్ చేసిన హీరో.. ఇద్దరు విలన్లను చంపేస్తాడు. ఆ ఇద్దరు విలన్లలో ఒకడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జెర్సీని వేసుకుని ఉంటాడు.




 


ఈ సీన్ పై హైకోర్ట్ లో పిటిషన్ దాఖలైంది. సోమవారం (ఆగస్ట్ 28) జరిగిన విచారణలో.. ఆ సీన్ నుంచి ఆర్సీబీ జెర్సీని తొలగించాలని ఢిల్లీ హైకోర్ట్ తీర్పిచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి జెర్సీ కనిపించకుండా అన్ని థియేటర్లలో, ఓటీటీలో సీన్ కనిపించాలని చిత్ర బృందానికి సూచించింది. అయితే, ఆర్సీబీ మేనేజ్మెంట్ గానీ, వేరే వ్యక్తులు గానీ దీనిపై ఫిర్యాదు చేసినట్లు తెలియలేదు. కానీ, ఉన్నట్టుంది హైకోర్ట్ తీర్పివ్వడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఆర్సీబీని తక్కువ చేశారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. జెర్సీ ఉన్న సీన్ ను తొలగించాలని మూవీ టీంను హెచ్చరిస్తున్నారు.

 




Tags:    

Similar News