కల్కికి కాస్త బ్రేక్.. 'కన్నప్ప' మూవీ షూట్‌కు ప్రభాస్
టాలీవుడ్ హీరో మంచు విష్ణు 'కన్నప్ప' మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో శివుడి పాత్రలో రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించనున్నాడు. పరమేశ్వరుడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడని తెలియడంతో ఫ్యాన్స్ అందరూ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రభాస్ పక్కన పార్వతిగా నయనతార కనిపించనుందనే టాక్ వినిపిస్తోంది. ఇకపోతే ఈ మూవీలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి స్టార్ హీరోలు కూడా నటిస్తున్నారు. మంచు మోహన్ బాబు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.
సలార్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ కల్కి 2898ఏడీ మూవీ షూటింగ్‌లో ఫుల్ బిజీ అయిపోయారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ మూవీని ఓ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. కల్కిలో బిగ్‌బీ అమితాబ్, కమల్ హాసన్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఈ మూవీలో ఓ పది మంది హీరోలు నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. విష్ణుమూర్తి దశావతారాల్లోని పాత్రలను స్టార్ హీరోయిలతో చేయిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. హాలీవుడ్ స్థాయిలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ పాటికే ఈ మూవీ నుంచి పోస్టర్స్, గ్లింప్స్ విడుదలై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు ఈ మూవీకి కాస్త బ్రేక్ ఇచ్చి ప్రభాస్ కన్నప్ప మూవీ సెట్‌లో జాయిన్ కానున్నాడు.
కన్నప్ప మూవీ కోసం ప్రభాస్ 12 రోజుల పాటు డేట్స్ అడ్జెస్ట్ చేశాడట. ఏప్రిల్ లోనే ప్రభాస్, నయనతార మధ్య కొన్ని సీన్స్ షూట్ చేయనున్నారట. ప్రస్తుతం ఈ క్రేజీ న్యూస్ ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది. ప్రభాస్ డైరెక్టర్ మారుతీతో ది రాజాసాబ్ అనే మూవీ కూడా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా ఆల్‌మోస్ట్ కంప్లీట్ అయ్యిందని తెలుస్తోంది. అయితే కల్కికి తర్వాతే ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. మొత్తానికి ప్రభాస్ తీరికలేకుండా ఇలా వరుస షూటింగ్ షెడ్యూల్స్‌తో బిజీ బిజీగా ఉంటున్నాడు.