ఐదేళ్లయినా జోష్ తగ్గలే.. స్టార్ హీరోల సినిమాలకు సమానంగా కలెక్షన్స్

Update: 2023-06-29 11:34 GMT

టాలీవుడ్ లో ఇప్పుడంతా రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు.. రీరిలీజ్ అయి మళ్లీ హిట్ కొండుతున్నాయి. వాటి సరసన విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’ నిలిచింది. ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఎంత బాగున్నా సరే వాటికి అంత గుర్తింపు రావు. థియేటర్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయలేక, అండర్ రేటెడ్ గా మిగిలిపోతాయి. తర్వాత ఓటీటీలోకి వచ్చాక సూపర్ హిట్ అవుతాయి. అలాంటి సినిమానే ‘ఈ నగరానికి ఏమైంది’. తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా స్టోరీ పరంగా బాగున్నా.. ప్రమోషన్స్ చేయకపోవడం వల్లనో, స్టార్ క్యారెక్టర్లు లేకపోవడం వల్లనో అంతగా ఆడలేదు. ఓటీటీలోకి వచ్చాక చాలామంది ‘అబ్బా ఈ సినిమాను థియేటర్లో ఎలా మిస్ అయ్యాం’అనుకున్నారు.




 





 


అప్పటినుంచి రీరిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. జూన్ 29.. ఈ సినిమా రిలీజ్ అయి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా.. చిత్ర బృందం రీరిలీజ్ కు ప్లాన్ చేసింది. హైదరాబాద్ లోని 210 స్క్రీన్స్ లో విడుదల చేయగా.. అన్నీ హౌజ్ ఫుల్ టాక్ తో నడుస్తున్నాయి. 2018 జూన్ 29న రిలీజ్ అయిన సినిమాకు మొదటి రోజు కలెక్షన్స్ కేవలం రూ. 20 లక్షలే రాగా.. ఇవాళ జరిగిన రీరిలీజ్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక్క మార్నింగ్ షో కలెక్షనే రూ. 80 లక్షలు దాటింది. దీంతో ఫ్యాన్స్ తో పాటు మూవీ టీం కూడా సంబరాల్లో మునిగిపోయింది.




 










 

 

Tags:    

Similar News