Vijay Devarakonda - Rashmika Mandanna : విజయ్ దేవరకొండ, రష్మికను ఇలా అవమానిస్తున్నారేంటీ..?
ఏ హీరో హీరోయిన్ అయినా కలిసి నటించిన సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి.. అది వారి కెరీర్ కు పెద్ద హెల్ప్ అయితే.. వారి మధ్య స్నేహం ఏర్పడటం కామన్ గానే చూస్తున్నాం. ఈ జంటకు ఇండస్ట్రీ పరిభాషలో కాంబినేషన్ క్రేజ్ అంటూ కొత్త బిరుదు కూడా యాడ్ అవుతుంది. ఆ బిరుదుతోనే తర్వాత మరో సినిమా చేసిన జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా. ఈ ఇద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా గీత గోవిందం. ఈ మూవీ టైమ్ లో వీరి మధ్య సాగిన ట్విట్టర్ రొమాన్స్ సినిమాకు ఎంత పెద్ద హెల్ప్ అయిందో వేరే చెప్పక్కర్లేదు. అప్పుడే విజయ్, రష్మిక మధ్య ఏదో ఉందన్న రూమర్స్ మొదలయ్యాయి. దీనికి తోడు రష్మికకు అప్పటికే అయిన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ కావడంతో ఈ రూమర్స్ కు మరింత బలం వచ్చింది. తర్వాత వీళ్లిద్దరూ డియర్ కామ్రేడ్ అనే సినిమాలో నటించారు. ఈ మూవీ డిజాస్టర్ అయింది. అయినా వీరి మధ్య స్నేహం కొనసాగుతుంది. ఇంకొందరు దాన్ని ప్రేమ అంటారు. ప్రేమైనా, స్నేహమైనా అది వారి ఇష్టం. అడల్ట్స్ గా తమ అభిప్రాయాలు, అభిమానాలను పంచుకునే, ఎంచుకునే హక్కు ఉన్నవాళ్లు. కేవలం సినిమా పరిశ్రమలో ఉన్న కారణంగానే వీరి బంధం గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అటు మీడియాలో సైతం వీరి ప్రేమ గురించి కథలు కథలుగా రాసుకుంటున్నారు. వీటికి రూమర్స్ అనే పేరు పెట్టుకున్నారు. బట్ ఇండస్ట్రీకి ఏమైంది. కొన్ని రోజుల క్రితం నాని నటించిన హాయ్ నాన్న మూవీకి సంబంధించిన ఒక ఏవిలో విజయ్, రష్మికల మాల్దీవ్స్ ఫోటోస్ ను వేశారు. తర్వాత నాని అది తనకు తెలియదని తనకు దానికి ఏం సంబంధం లేదని కూడా చెప్పాడు. ఇక తాజాగా నితిన్ నటించిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ సినిమాలో ఏకంగా విజయ్, రష్మిక రిలేషన్ గురించి ఒక సీనే ఉంది. వాళ్లమధ్య బంధం గురించి అన్నపూర్ణ పాత్ర ద్వారా అడిగించడం.. దానికి డొంకతిరుగుడుగా జులాయి సినిమాలోని పాటను ప్లే చేస్తూ నితిన్ డ్యాన్సులు కట్టడం అనే సన్నివేశం సదరు దర్శకుడి దిగజారుడు ఆలోచనకు తార్కాణం. మరొకరి ప్రైవసీ గురించి ఇలా పబ్లిక్ లో మాట్లాడకూడదు అన్న కనీస సంస్కారం లేకపోవడం అంటే తప్పేముందీ. అంతకు ముందు బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో కూడా వీరి రిలేషన్ గురించి ఓపెన్ గా మాట్లాడుతూ.. కాస్త చిన్నబుచ్చుకునేలానే ప్రవర్తించారు. అయినా ఒకే పరిశ్రమలో ఉన్నప్పుడు తమ తోటి నటీ నటుల ప్రైవసీని గౌరవించాలి కదా..? వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి కదా.. ఆ మాటకొస్తే.. ఈ తరహాలో విజయ్, రష్మిక మాత్రమే ఉన్నారా..? ఇంకా ఎంతోమంది ఇలాంటి ప్రైవేట్ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు కదా.. వాళ్ల గురించి ఎందుకు మాట్లాడరు.. అంటే విజయ్ కి బ్యాక్ గ్రౌండ్ లేదు. మీడియా సపోర్ట్ లేదు. అందుకే వారి వ్యక్తిగత జీవితంపై నిస్సిగ్గుగా సినిమావాళ్లే సెటైర్స్ వేస్తున్నారు.
ఇప్పటి వరకూ విజయ్ కానీ రష్మిక కానీ మేం రిలేషన్ ఉన్నాం అని ఎప్పుడూ చెప్పలేదు. చెప్పాల్సిన పని కూడా లేదు. అది వ్యక్తిగత అంశం. అయినా ఎవరి పని వాళ్లు చేసుకుంటున్నారు. ఎవరి కెరీర్ ను వాళ్లు బిల్డ్ చేసుకుంటున్నారు. ఒకరి ఇంటికి ఒకరు వెళ్లినంత మాత్రాన, ఇద్దరూ కలిసి వెకేషన్ కు వెళ్లినంత మాత్రాన.. దాన్ని ఇలా పబ్లిక్ లో సెటైరికల్ గానో, కామెడీగానో మరొకరు అదీ సేమ్ ఇండస్ట్రీ పర్సన్ చెప్పడం అనేది ఖచ్చితంగా అభ్యంతరకరమే. ఏదైనా ఇంగితజ్ఞానం ఉంటే ఇలాంటి విషయాలను గురించి అలా చెప్పరు. ఇది మాత్రం చెప్పొచ్చు.