ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఓ సినిమా తీయనున్నట్లు ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇటీవలే ప్రకటించారు. ఈ మూవీని రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. మొదటి భాగానికి ‘వ్యూహం’, రెండో భాగానికి ‘శపథం’ టైటిల్స్ ను ఫిక్స్ చేసినట్లు ప్రకటించాడు. వర్మ మూవీ అనౌన్స్‌మెంట్ తో ఏపీ పాలిటిక్స్ తో పాటు సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ఆర్జీవీ తాజాగా వ్యూహం మూవీ షూటింగ్ మొదలు పెట్టాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సెట్స్ లో ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేశాడు.
తాజాగా ఈ చిత్రంలో పాత్రలు, నటులను పరిచయం చేస్తూ ఆర్జీవీ ట్విట్టర్ లో కొన్ని ఫొటోలు పోస్ట్ చేశారు. వైఎస్ జగన్ పాత్రను లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీలో జగన్ పాత్రలో కనిపించిన అజ్మల్ అమీర్ పోషిస్తుండగా, వైఎస్ భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ అనే యువతి కనిపించనుంది. ఈ చిత్రానికి చెందిన పలు స్టిల్స్ ను వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీరిద్దరి ఫస్ట్ లుక్ చూసిన నెటిజన్లు క్యారెక్టర్లకు కరెక్టుగా సెట్టయ్యారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
వ్యూహం మూవీ బయోపిక్ కాదని దాన్ని మించిన రియల్ పిక్ అని వర్మ గతంలోనే ప్రకటించాడు. ఇందులో అన్నీ నిజాలే ఉంటాయని చెప్పాడు. ఇప్పటికే వ్యూహం షూటింగ్ మొదలుపెట్టిన వర్మ ఆ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల ముందు కూడా ఆర్జీవీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీని ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. దీంతో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ మూవీని రిలీజ్ చేయవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యూహం సినిమాకు దాసరి కిరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Y S Jagan and Y S Bharathi having a word about YSR in VYOOHAM pic.twitter.com/ZBEHTolXLT
— Ram Gopal Varma (@RGVzoomin) June 1, 2023
'వ్యూహం' ఫోటోలు...#MaaGulf @RGVzoomin @maagulf @ysjagan pic.twitter.com/Te3uZieF8p
— Maa Gulf (@maagulf) June 1, 2023