హే శ్రీలక్ష్మీ.. నీకు ఇంట్రెస్ట్ ఉంటే.. ఆర్జీవీ ట్వీట్ వైరల్..

By :  Krishna
Update: 2023-09-27 13:27 GMT

రాంగోపాల్ వర్మ (RGV Tweet ).. ఒకప్పుడు ఇండియన్ సినిమా సెన్సేషనల్ డైరెక్టర్.. ఇప్పుడు కాంట్రవర్సీ డైరెక్టర్. తన సినిమాలు, తన పోస్టులు, ఇంటర్వ్యూలతో ఎప్పుడు ఏదో ఓ వివాదానికి కేరాఫ్ అడ్రస్గా నిలుస్తాడు. ప్రస్తుతం ఏపీ రాజకీయాలకు సంబంధించి వ్యూహం అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఓ అమ్మాయి వీడియోను షేర్ చేస్తూ ఆర్జీవీ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.

ఆ వీడియోలో ఓ అమ్మాయి ఎల్లో శారీలో కెమెరా పట్టుకుని ఫోటోలు తీస్తూ కనిపించింది. అయితే ఈ వీడియోను షేర్ చేసిన ఆర్జీవీ.. ఆ వీడియోలో ఉన్నది ఎవరో చెప్పాలంటూ నెటిజన్స్‌ను ప్రశ్నించారు. దీంతో ఆ అమ్మాయి కోసం నెట్టింట బాగా సెర్చింగ్ జరిగింది. చివరకు ఆర్జీవీకి ఆ అమ్మాయి వివరాలు దొరికాయి. ఈ క్రమంలో ఆయన మరో ట్వీట్ చేశారు. హే శ్రీలక్ష్మీ నీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే.. నీ డీటెయిల్స్ పంపు అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఆర్జీవీ కన్ను ఆ అమ్మాయి మీద పడిందా.. పాపం ఆ అమ్మాయిని వదిలేయ్ అంటూ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. మరోవైపు శ్రీలక్ష్మీ సైతం వర్మ పోస్ట్ పై తెగ సంబరిపోతూ.. ఆ స్క్రీన్ షాట్ను తన ఇన్ స్టా స్టోరీలో పెట్టుకుంది. కాగా శ్రీలక్ష్మీ కేరళకు చెందిన అమ్మాయి.




Tags:    

Similar News