రామ్ చరణ్, ఉపాసనల కుమార్తె క్లీంకార కడుపులో పడ్డదగ్గర నుంచీ సెలబ్రిటీ స్టేటస్ మెయింటేన్ చేస్తోంది. తల్లిదండ్రులిద్దరూ సెలబ్రిటీలే అవడంతో ఆమె గురించి ఏ చిన్న వార్త బయటకు వచ్చిన సెన్సేషనలే అవుతోంది. మొన్ననే క్లీంకార రూమ్ చూడండి అంటూ ఉపాసన ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు రామ్ చరణ్ ఆమెకు సంబంధించి మరో ఫోటోను చేశారు. దాన్ని కూడా వైరల్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్.
రామ్ చరణ్ తన కూతురు ఎలా ఉంటుందో ఇప్పటివరకూ రివీల్ చేయలేదు. ఆడపిల్ల పుట్టిందని...పాపను ఎత్తుకుని ఉన్న తమ ఫోటోలను షేర్ చేశారు చరణ్ దంపతులు. తరువాత బాలసారె రోజు ఉయ్యాలలో పాప ఉన్న ఫోటోను పెట్టారు. మళ్ళీ క్లీంకార రూమ్ ఇదేనంటూ ఉపాసన వీడియో పెట్టారు. ఇప్పుడు బేబి పడుకున్న ఉయ్యాల దగ్గర వాళ్ళ పెంపుడు కుక్క రైమ్ ఉన్న ఫోటోను షేర్ చేశారు చరణ్. దానికి నైట్ డ్యూటీ చేస్తూ తన చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటున్నాను అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ ఫోటో బాగా వైరల్ అవుతోంది. లైకులు, కామెంట్లు తెగ పెడుతున్నారు. పాపా ఫోటో కూడా పెట్టుంటే బాగుండేదని కామెంటుతున్నారు. మరికొందరేమో జాగ్రత్తగా చూసుకో అంటూ రైమ్ కు సలహాలు ఇచ్చారు.
రామ్ చరణ్, ఉపాసన ఇద్దరూ పెట్ లవర్స్. చరణ్ కు గుర్రాలంటే మహాఇష్టం. ఆయన దగ్గర ఓ పెద్ద గుర్రాలశాలే ఉంది. అది కాకుండా చరణ్ తన ఇంట్లో ఓ కుక్కను కూడా పెంచుకుంటున్నారు. దానికి రైమ్ అని పేరు పెట్టారు. ఈమధ్య కాలంలో రైమ్ ను ఎక్కువగా ఎత్తుకుని ఉన్న ఫోటోలు పెడుతున్నారు. చేతిలో పాప ఒకవైపు, మరో చేతిలో రైమ్ ను పట్టుకున్న ఫోటో కూడా ఇంతకు ముందు పెట్టారు. ఇప్పుడు పాపను చూసుకుంటున్న కుక్క ఫోటో పెట్టారు చరణ్.
తమ మెగా ప్రిన్సెస్ కోసం ఓ లగ్జరీ రూమ్ ని ఏర్పాటు చేశారు రామ్ చరణ్, ఉపాసన.ఇంట్లో తమ కుమార్తె చుట్టు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా ఇంటీరియర్ సిద్దం చేయించారు. అంతేకాదు తాత, నానమ్మలకు మనవరాలు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు చిరంజీవి ఇంటికి షిఫ్ట్ కూడా అయ్యారు.