కోలీవుడ్ యంగ్ హీరోతో ఐశ్వర్య రజినీకాంత్ రెండో పెళ్లి..?
కోలీవుడ్ స్టార్ ధనుష్తో విడిపోయాక ఐశ్వర్య రజినీకాంత్ సింగిల్ మదర్ గానే ఉంటున్నారు. 2004లో వీరి పెళ్లి జరగ్గా.. 18 ఏళ్ల తర్వాత విడిపోయారు. విడాకుల తర్వాత ఈ జంట మళ్లీ కలుస్తున్నారంటూ అప్పట్లో వార్తలొచ్చాయి. స్వయంగా సూపర్ స్టార్ రజినీ కాంతే వీరిని కలపుతున్నట్లు ఆ వార్తల సారాంశం. అయితే ఆ ప్రచారంపై అటు ఐశ్వర్య, ఇటు ధనుష్ స్పందించలేదు. ఇక ఇప్పుడు మరో ప్రచారం నెట్టింట జోరుగా జరుగుతోంది.
ఐశ్వర్య రజినీకాంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓ కోలీవుడ్ హీరోను ఆమె పెళ్లాడనున్నట్లు తెలుస్తోంది. ఐశ్వర్య ఈమధ్య కోలీవుడ్‌కు చెందిన ఓ హీరోతో కనిపించిందని తెలుస్తోంది. చెన్నైలోని ఓ రిసార్ట్‌లో అతడితో ఆమె సన్నిహితంగా మెలుగుతూ కనిపించడంతో ఈ రెండో పెళ్లిపై పుకార్లు మొదలైనట్లు తెలుస్తోంది.
ఈ ప్రచారంపై ఐశ్వర్య ఇంతవరకు స్పందించలేదు. ఐశ్వర్య ప్రస్తుతం లాల్ సలామ్ అనే సినిమాను డైరెక్ట్ చేస్తోంది. అయితే ఐశ్వర్య రెండో పెళ్లి చేసుకోవడంలో ఎటువంటి తప్పులేదని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. పలువురు మాత్రం ఆమెపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరి పిల్లలతో రెండో పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని అంటున్నారు. అయితే ఐశ్వర్య స్పందిస్తేనే ఈ ప్రచారానికి తెరపడే అవకాశం ఉంది.