సలార్ ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది..

By :  Babu Rao
Update: 2023-11-09 10:17 GMT

ప్రభాస్ సలార్.. ఈ మాట చాలాకాలంగావినిపిస్తోంది కానీ.. ఈ సినిమా గురించిన సరైన అప్డేట్ మాత్రం రావడం లేదు. ఈ విషయంలో ఫ్యాన్స్ ఎన్నోసార్లు అడిగారు. డిమాండ్ చేశారు. ఓ దశలో హొంబలే బ్యానర్ తో పాటు దర్శకుడుని కూడా టార్గెట్ చేసి సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. అయినా వారు అభిమానుల ఆవేదనను అస్సలు పట్టించుకోలేదు. వారి ఎమోషన్ ను లెక్క చేయలేదు. ఓ రకంగా ఫ్యాన్స్ ను సలార్ మేకర్స్ అవమానించారు అనే చెప్పాలి. ఇన్ని అవమానాలు పడిన తర్వాత ఫ్యాన్స్ మాత్రం పట్టించుకుంటారా.. వాళ్లూ లైట్ తీసుకున్నారు. ఇక ఇప్పుడు బిజినెస్ వంతు వచ్చింది. బిజినెస్ పరంగా ప్రభాస్ రేంజ్ ను క్యాష్ చేసుకోవాలన్న ఆరాటమే తప్ప.. ఆ సినిమా రేంజ్ ను కూడా ముందు కాస్త చూపించాలి అన్న ఇంగితం చూపించడం లేదు మేకర్స్. ఇటు ప్రభాస్ కూడా హెల్త్ ఇష్యూస్ వల్ల కాస్త దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఇండియా వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాడు.

సలార్ గురించి కొన్ని రోజులుగా వస్తోన్న వార్త ఏంటంటే.. దీనికి సెకండ్ పార్ట్ ఉండదు అని. మొత్తం ఒకే పార్ట్ లో చుట్టేయబోతున్నారు అంటున్నారు. ఈ మేరకు కొన్ని సీన్స్ ను వదిలేసి.. మరికొన్ని సీన్స్ షూటింగ్ చేస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ముందు రీ షూట్ అన్నారు కానీ కాదు. కొన్ని ఫ్రెష్ సీన్స్ నే చిత్రీకరిస్తున్నారు. అలాగే సినిమా మరీ డ్రై గా ఉందనుకున్నారట. అందుకే ఓ ఐటమ్ సాంగ్ యాడ్ చేస్తున్నారు. సిమ్రన్ కౌర్ అనే నటిపై ఈ ఐటమ్ సాంగ్ ను ఇప్పుడు హైదరాబాద్ లోనే చిత్రీకరిస్తున్నారు. ఈ ఐటమ్ సాంగ్ కు ప్రభాస్ తో పనిలేదట. అందుకే ఆయన లేకుండానే షూటింగ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా పోస్ట్ పోన్ అయిందనే వార్తలు ఎప్పట్లానే వస్తున్నాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. రెండోసారి చెప్పినట్టుగానే డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘‘డిసెంబర్ 1న సలార్ ట్రైలర్ విడుదల’’ చేయబోతున్నారు. ఈ ట్రైలర్ తర్వాత ప్రమోషన్స్ పరంగా ఓ కొత్త స్ట్రాటజీతో ముందుకు వెళ్లాలనేది మూవీ టీమ్ చేస్తోన్న ఆలోచన. ఆ ప్రమోషన్స్ ఎలా ఉంటాయో కానీ.. ముందు ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ పై కాస్త గట్టిగా ఫోకస్ చేయాలనేది అభిమానుల మాట.

Salaar movie release date, Salaar movie teaser,

Prabhas with Prashanth Neel, Prithviraj Sukumaran,

Prashanth Neel, Hombale Films,

Salaar movie trailer to be released on December 1st,

Tags:    

Similar News