Salaar Release Date : సలార్ నుంచి స్పెషల్ పోస్టర్.. రిలీజ్ డేట్ ఫిక్స్

Byline :  Veerendra Prasad
Update: 2023-09-29 05:27 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘సలార్’. నిజానికి ఈ సినిమా ఈ నెల 28 విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వాయిదా పడడంతో.. సినిమా రిలీజ్ డేట్ అప్డేట్ కోసం రెబల్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించింది మూవీ టీమ్. ప్రపంచవ్యాప్తంగా సలార్ ఈ ఏడాది డిసెంబర్ 22న రిలీజ్ కానున్నట్లు స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.




 


‘సలార్’ సినిమాను 1979 బ్యాక్ డ్రాప్‌ నేపథ్యంలో తెరకెక్కించిన నేపథ్యంలో అందుకే 1979 లొకేషన్స్‌లో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు అభిమానులు. మరోవైపు ప్రభాస్ పుట్టింది 1979 కాబట్టి ఇన్ని చోట్ల ప్రీమియర్స్ వేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా అమెరికాలో ఇన్ని లొకేషన్స్‌లలో ప్రీమియర్స్ వేయనున్న తొలి భారతీయ చిత్రంగా ‘సలార్’ రికార్డులకు ఎక్కనుంది.




 


అయితే షారుఖ్ ఖాన్ నటించిన డుంకి చిత్రం కూడా ఆ రోజే రిలీజ్ కి రెడీ అవుతోంది. సలార్, డుంకి ఈ రెండు సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. రెండు చిత్రాల నిర్మాతలు యూస్ డిస్ట్రిబ్యూటర్స్ కి కూడా అప్డేట్స్ ఇచ్చేశారు. దీనితో యుఎస్ లో ఈ రెండు చిత్రాలు డిసెంబర్ 21న ప్రీమియర్స్ కి రెడీ అవుతున్నాయి. డుంకి చిత్రం రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ లాంటి భారీ హిట్స్ తో జోరుమీద ఉన్నారు. ఇక ప్రభాస్ నుంచి బాహుబలి తర్వాత సరైన చిత్రం లేదు. దీనితో ప్రభాస్ అభిమానులు ఆకలి మీద ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు చిత్రాలు తలపెడితే బాక్సాఫీస్ జాతర జరుగుతుంది అని విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి.. ప్రభాస్, షారుఖ్‌కు జరిగే బ్యాటిల్‌లో గెలుపెవరిదో చూడాలి.




 





Tags:    

Similar News