సలార్లో మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఉండదట.. చిత్ర బృందం క్లారిటీ

Update: 2023-08-17 11:45 GMT

కేజీఎఫ్‌ డైరెక్టర్ ప్ర‌శాంత్ నీల్ ప్ర‌భాస్ కాంబోలో రాబోతున్న హైవొల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ సినిమా సలార్. సెప్టెంబ‌ర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. విడుదలైన ఫ‌స్ట్ డే రికార్డు స్థాయి ఓపెనింగ్స్‌ని రాబ‌ట్ట‌డం ఖాయమని గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు. అయితే ఈలోగా ఈ సినిమా గురించి చిన్న అప్డేట్ బయటకు రావడంతో ఫ్యాన్స్ లో ఆందోళన మొదలయింది. కేజీఎఫ్ కంటే ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుందని.. స్టోరీ, గ్రాఫిక్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్లు కూడా కేజీఎఫ్ ను మించి ఉంటాయని ప్రశాంత్ నీల్ కన్ఫార్మ్ చేశాడు. ఈ క్రమంలో మరో వార్త టెన్షన్ పెడుతోంది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటంటే..

ఏ సినిమా నుంచైనా మొదట రిలీజ్ అయ్యేది పాటలే. ప్రభాస్ అభిమానులు కూడా ఎప్పుడెప్పుడా అని సలార్ పాటల కోసం ఎదురుచూస్తున్నారు. మరో 40 రోజుల్లో సినిమా రిలీజ్ అవుతున్న క్రమంలో చిత్ర బృందం ఇక సినిమా ఆల్బమ్ రిలీజ్ చేస్తుందని భావించిన ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. సినిమాలో కేవలం ఒక పాటే ఉండి.. మిగిలినవన్నీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంటాయట. దాంతో సినిమా నుంచి ఆల్బమ్ రిలీజ్ ఉండదని.. డైరెక్ట్ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ప్రమోషన్లు మొదలుపెడతారట.


Tags:    

Similar News