కోడికూత వేళ ప్రభాస్ ఊచకోత... 'సలార్' టీజర్ అదుర్స్
పవర్‌ఫుల్ లుక్.. గూస్‌బంప్స్ పక్కా;
రాజమౌళి-ప్రభాస్‌ల బాహుబలి కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూశారో... ఇప్పుడు అంతే ఆత్రుతగా సలార్ సినిమా కోసం పడుతున్నారు. కన్నడ హీరో యశ్‌ను రాఖీ భాయ్ అనే పవర్ ఫుల్ రోల్ చూపించిన ప్రశాంత్ నీల్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను అంతకుమించి చూపిస్తాడని భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. ఈ సినిమా టీజర్ ను గురువారం ఉదయం 5:12 గంటలకు టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించినప్పటి నుంచి అస్సలు ఆగలేకపోయారు. ఎప్పుడు తెల్లారుతుందా? ఎప్పుడు టీజర్ చూద్దామా? అనుకుంటూ తెల్లవారుజామున 5 గంటలకే చేతుల్లో ఫోన్‌లు పట్టుకొని పడిగాపులు పడ్డారు. అయితేచెప్పిన టైమ్‌కి సలార్ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ రిలీజ్ చేస్తూ ఇది పార్ట్ 1 అని అధికారికంగా ప్రకటించడంతో అభిమానులంతా ఫుల్ ఖుషి అవుతున్నారు
టీజర్ ఎలా ఉందంటే..
ప్రశాంత్ నీల్ ఇంతకు ముందు KGF సినిమా కథని ఎలా అయితే ఓ వ్యక్తి నేరేట్ చేసుకుంటూ వెళతాడో Salaar కూడా అదే తరహాలో ఉంటుంది అన్నట్టుగా చెప్పేసాడు. టిన్ను ఆనంద్ డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. " సింపుల్ ఇంగ్లీష్.. నో కన్ఫ్యూజన్... లయన్ , చీతా, టైగర్, ఎలిఫెంట్ వెరీ డేంజరస్, బట్ నాట్ ఇన్ జురాసిక్ పార్క్ (JurrasickPark)' అనే డైలాగుతో మొదలవుతుంది. అయితే Prashanth Neel చాలా తెలివిగా డైలాగ్ మొత్తం ఇంగ్లీష్ లో చెప్పించాడు కాబట్టి ఇంకా వేరే భాషలో సెపరేట్ గా ఆ డైలాగ్ చెప్పనవసరం లేదు. ఉదయం నుండి ప్రభాస్ అభిమానులకు పండగలా తయారయైనది. ఎందుకంటే 'కేజీఎఫ్' తరహాలోనే ఇందులో కూడా ప్రభాస్ ని బాగా ఎలివేట్ చేసే డైలాగ్ చెప్పించి, అప్పుడు Prabhas ని చూపిస్తాడు. అయితే ప్రభాస్ ని పూర్తిగా కాకుండా పక్కనుండి మాత్రమే చూపించాడు. 'కేజీఎఫ్' లో ఎలా అయితే నేపథ్యం నల్లగా.. గనులు, గన్నులు, బాంబులు, దుమ్ము... ఎలా చూపించాడో ఇందులో అంతకి మించి అవన్నీ ఉంటాయి అని చెప్పకనే చెప్పాడు. ఈ టీజర్ అంతటికీ బ్యాక్ గ్రౌండ్ సంగీతం అదిరింది.
కేజీఎఫ్ ని మించి..
సలార్ టీజర్ చూస్తుంటే కేజీఎఫ్ ను మించిపోయేలా ప్రభాస్‌కు ఎలివేషన్ ఇచ్చినట్టు అర్థమవుతుంది. "సింహం, పులి, చిరుత, ఏనుగు ఇవన్నీ చాలా ప్రమాదకరమైన జంతువులే.. కానీ జురాసిక్ పార్కులో మాత్రం కాదు.. ఎందుకంటే" అంటూ డైలాగ్ మధ్యలోనే ఆగిపోవడం.. ఆ తర్వాత పవర్‌ఫుల్ బీజీఎంతో ప్రభాస్‌ను చూపించడం గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ బ్యాక్‌గ్రౌండ్ లో మైనింగ్ ఏరియాలో ఉన్న విజువల్స్ చూస్తుంటే కేజీఎఫ్ సినిమాను మించిపోయేలా సలార్‌ను ప్లాన్ చేసినట్టు అర్థమవుతోంది. ఇక ఈ సినిమా రెండు పార్ట్‌లుగా విడుదల కానుంది. ‘సలార్: పార్ట్1: సీజ్‌ఫైర్’(Salaar Part 1 - Ceasefire) సెప్టెంబరు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతిహాసన్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. కేజీఎఫ్‍ను నిర్మించిన హొంబాలే ఫిల్మ్స్ బ్యానర్.. ఈ సలార్ మూవీని కూడా ప్రొడ్యూస్ చేస్తోంది.