నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్.. ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి..!

Update: 2023-07-06 08:05 GMT

పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ టీజర్ ‘సలార్’.. గురువారం (జులై 6) ఉదయం 5:12 గంటలకు విడుదల చేశారు. అంత పొద్దున రిలీజ్ చేసినా.. కొన్ని క్షణాల్లోనే టీజర్ కు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సలార్ పై ప్రభాస్ ఫ్యాన్స్ గట్టి నమ్మకం పెట్టుకున్నారు. వరుస ఫ్లాప్స్ తో ఉన్న ప్రభాస్ కు ప్రశాంత్ నీల్ సలార్ తో హిట్ ఇస్తాడని అనుకున్నారు. ఆ టాక్ తో ఇవాళ రిలీజ్ అయిన టీజర్.. ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేపోయింది.

డైలాగ్స్, ప్రభాస్ ను చూపించిన ఎలివేషన్స్, టేకింగ్, బీజీఎం అంతా బాగానే ఉన్నా.. ఫ్యాన్స్ మాత్రం ఎందుకో నిరాశ చెందారు. ఫస్ట్ టీజర్ లో ప్రభాస్ స్క్రీనింగ్ ఎక్కువ లేకపోవడం, ఉన్న కొద్ద క్షణం అయినా.. ముఖం కనిపించకుండా సస్పెన్స్ పెట్టడంతో అభిమానులు నిరాశ చెందారు. అంతే కాకుండా ట్విట్టర్ లో ‘Disappointed’ (డిసప్పాయింటెడ్) అంటూ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేశారు. ఇది ప్రస్తుతం ట్విట్టర్ ట్రెండింగ్ లో ఉంది. కొందరు ఇది సలార్ టీజరా..? లేక గ్లింప్సా..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దీంతో సినిమా టీంలో ఆందోళన మొదలయింది. నిజంగానే ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారా..? సినిమా భవిష్యత్తు ఏంటని భయపడుతున్నారు.


Full View





Tags:    

Similar News