విడుదలకు ముందే ఎన్నో అంతర్జాతీయ రికార్డులను కొల్లగొట్టిన సినిమా ‘మట్టికథ’. తెలుగు వెండితెర రియాలిటీకి పట్టడం కడుతోంది. ఇంతవరకు సెల్యూలాయిడ్‌పై కనిపించని ముడి జీవితపు కథలను కొత్త దర్శకులు అద్భుతంగా పరిచయం చేస్తున్నారు. మైక్ మూవీస్ బ్యానర్‌పై వస్తున్న ‘మట్టికథ’ కూడా అటువంటిదే. ఈ సినిమా పల్లెటూరి కుర్రకారు ఆశనిరాశలను, ప్రేమలను, సరదాలను కళ్లకు కట్టేలా సరికొత్తగా రూపొందించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఓ పాట రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టగా.. ఇప్పుడు మరో సాంగ్ రిలీజ్ను రిలీజ్ చేసింది చిత్ర బృదం.
మట్టికథలోని ర్యాప్ సాంగ్.. ‘సల్లగుండు నాయన’ ఇవాళ ఉదయం 11గంటలకు విడుదలైంది. ఈ పాటను ఫేమస్ ఫోక్ సింగర్ కనకవ్వ పాడింది. హీరో అజయ్ వేడ్, కనకవ్వ, సుధాకర్ రెడ్డి ర్యాపర్ లుక్లో కనిపించి అదరగొట్టారు. ర్యాప్ బీట్కు పల్లె పాట తోడైతే ఎలా ఉంటుందో.. ఈ పాట అలానే ఉంటుంది. సాంగ్ వింటున్నంతసేపు ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తుంది. మైక్ మూవీస్ ప్రొడక్షన్ హౌస్ నుంచి మరో మాణిక్యం మట్టికథ రూపంలో రాబోతుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మూవీ యూనిట్ ప్రకటించింది. పవన్ కడియాల డైరెక్టర్లో ఈ సినిమాను మైక్ మూవీస్ బ్యానర్‌పై అన్నపరెడ్డి అప్పిరెడ్డి నిర్మించారు. సతీశ్ మంజీర సహనిర్మాత వ్యవహరిస్తున్నారు. స్మరణ్ సాయి సంగీతం అందించారు.