సమంత అభిమానులకు బ్యాడ్ న్యూస్

Update: 2023-07-05 06:38 GMT

అభిమానులకు సమంత గుండెపగిలే వార్త చెప్పింది. ఒక ఏడాదిపాటూ సినిమాలకు తాను దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం సిటాడెల్ ఇండియన్ వెర్షన్, ఖుషి సినిమాల్లో నటిస్తున్న సమంత వాటి తర్వాత బ్రేక్ తీసుకుంటానని చెప్పింది.




 


అయ్యో అదేంటి సమంత అలా చేసిందంటూ అభిమానులు వాపోతున్నారు. సడెన్ గా సినిమాలు చేయనంటూ ప్రకటించేసరికి షాక్ కు గురవుతున్నారు. ప్రస్తుతానికి లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నాని సామ్ బేబి అనౌన్స్ చేసింది. ఏడాది పాటూ ఏమీ చేయనని....పర్శనల్ లైఫ్, ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టదలుచుకున్నాని అంటోంది. వచ్చే ఏడాది మిడ్ లేదా ఆ తర్వాతే కొత్త సినిమాల మీద సంతకం చేస్తానని చెప్పింది. కొత్త సినిమాల కోసం అడ్వాన్సులను సైతం నిర్మాతలకు తిరిగి ఇచ్చేసింది. దీంతో ఏడాది తర్వాత అయినా ఆమె మీవీస్ చేస్తుందా లేదా అని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ సమంత సన్నిహితులు మాత్రం ఏడాది తర్వాత గ్యారంటీగా మళ్ళీ నటిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు.




 


ప్రస్తుతం సమంత, విజయదేవరకొండ కలిసి చేస్తున్న సినిమా ఖుషి చివరి షెడ్యూల్ నడుస్తోంది. సీటాడెల్ వెబ్ సీరీస్ కూడా వేంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే వీటి తర్వాత సామ్ సినిమాల్లో నటించకపోయినా ప్రమోషన్స్ లో మాత్రం పాల్గొంటుంది. వాటి ద్వారా తన అభిమానులకు కనెక్ట్ అవుతానని చెబుతోంది.


Tags:    

Similar News