విజయ్తో సమంత లంచ్ డేట్.. నెట్టింట్లో వైరల్ పోస్ట్

Update: 2023-06-01 13:20 GMT

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సమంత.. విజయ్ దేవరకొండపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఖుషి సినిమా షూటింగ్ కోసం తుర్కియే వెళ్లిన ఈ ఇద్దరు.. నిన్న లంచ్ డేట్ కి వెళ్లారు. ఈ డేట్ కు సంబంధించిన ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ.. విజయ్ తో తనకున్న అనుబంధాన్ని నెటిజన్స్ తో పంచుకుంది.

విజయ్ దేవరకొండ సంతోషాలు, కష్టాలు చూశా. కెరీర్ లో నీ ఎత్తుపల్లాలను చూశా. వాటన్నింటినీ ఎదురుకుని హ్యాపీగా ఉండటాన్ని చూశా. ఎలాంటి సమయాల్లోనైనా కొంతమంది స్నేహితులు మనతో ఉండిపోతారు. అందులో విజయ్ కూడా ఉన్నాడు’ అంటూ ఇన్ స్టాలో రాసుకొచ్చింది. దీనిపై స్పందించిన విజయ్.. ‘సామ్ నువ్ నా ఫేవరెట్’ అంటూ రీ పోస్ట్ చేశాడు. ఇప్పుడు పోస్ట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ పోస్ట్ లు చూసిన నెటిజన్స్ వీరి స్నేహం చూడ ముచ్చటగా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మహానటి సినిమాతో మొదలైంది వీరి ఫ్రెండ్ షిప్. ఇప్పుడు ఖుషి సినిమాలో కలిసి నటిస్తున్నారు. శివ డైరెక్షన్ లో కశ్మీర్ నేపథ్యంలో సాగే ఈ లవ్ స్టోరీ ఈ సినిమా. ఈ సినిమా మైత్రి మూవి మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన మొదటి పాట యూట్యూబ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Tags:    

Similar News