samantha : బాధ్యతలు అయిపోయాయి ఇక నేను వెళ్ళొస్తా...

Update: 2023-08-19 12:39 GMT

ద మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చి చాలా రోజులే అయింది. తన ఆరోగ్య కారణాల వలనే గ్యాప్ తీసుకుంటున్నాని....ఒక ఏడాది పాటూ మూవీస్ కు దూరంగా ఉంటానని చెప్పింది. తన ఆరోగ్యం కోసం అమెరికా వెళతానని కూడా చెప్పింది. కానీ ఇన్నాళ్ళు సమంత ఇక్కడిక్కడే తిరిగింది. ఫైనల్ గా నిన్న తల్లితో కలిసి అమెరికా ఫ్లైట్ ఎక్కింది.

బ్రేక్ తీసుకున్న తర్వాత సమంత కొన్నాళ్ళు ఈషా ఫౌండేషన్లో ఉంది. మరి కొన్నాళ్ళు బాలీలో గడిపింది. దాని తరువాత హైదరాబాద్ వచ్చేసి ఖుషీ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంది. సమంత నటించిన ఖుషి సినిమా మరో పది రోజుల్లో విడుదల కానుంది. దీని ప్రమోషన్స్ లో పాల్గొంటానని ఆమె మొదటి నుంచి చెబుతోంది. అందుకే దీనికి సంబంధించిన ఈ వెంట్స్ అన్నింటోనూ పాల్గొంటి. మ్యూజికల్ కన్సర్ట్ లో విజయ్ తో కలిసి డాన్స్ చేసింది. ఇంటర్వ్యూలు లాంటి వాటిల్లో సందడి చేసింది. దీంతో ఆమె బాధ్యత తీరిపోయింది.




 


ఇప్పుడు సమంత ఫోకస్ అంతా తన హెల్త్ మీదనే పెట్టనుంది అని తెలుస్తోంది. అందుకే తన తల్లితో కలిసి వెంటనే న్యూయార్క్ వెళ్ళిపోయిందని చెబుతున్నారు. నాలుగైదు నెలలు ఆమె అక్కడే ఉంటారని తెలుస్తోంది. చికిత్స్ పూర్తయిన తర్వాతనే తిరిగి హైదరాబాద్ రానుంది సమంత.

విజయ్-సమంత నటించిన ఖుషి మూవీ సెప్టెంబర్ 1 విడుదల అవనుంది. దీనికి శివనిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ మూవీతో విజయ్, సమంత ఇద్దరూ కమ్ బ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇప్పటివరకూ అయితే ఖుషి మీద పాజిటివ్ బజ్ నడుస్తోంది.


Tags:    

Similar News