Sampoornesh Babu New Movie : భారీ సినిమా రీమేక్తో.. రీఎంట్రీ ఇస్తున్న సంపూర్ణేశ్ బాబు

By :  Bharath
Update: 2023-09-19 12:18 GMT

హృదయ కాలేయం, సింగం 123 సినిమాతో హిట్ కొట్టి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు హీరో సంపూర్ణేశ్ బాబు. ఆ తర్వాత వచ్చిన క్యాలీఫ్లవర్, దగడ్ సాంబ సినిమాలు అంతగా ఆడకపోగా.. కొబ్బరి మట్ట సినిమాతో మళ్లీ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్ లో అవకాశం రావడం.. ఆ తర్వాత సినిమాలకు బాగా గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈసారి రీమేక్ బాట పట్టాడు. తమిళ స్టార్ కమెడియన్ నటించిన సూపర్ హిట్ సినిమా మండేలాను సంపూ రీమేక్ చేయబోతున్నాడు. తెలుగులో మార్టిన్ లూథర్ కింగ్ తో రాబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి బ్యానర్ విడుదల అయింది.

కొత్త డైరెక్టర్ పూజా అపర్ణ కొల్లూరు ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతోంది. మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పొలిటికల్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. అయితే ఇందులో సంపూ ట్రేడ్ మార్క్ కు ఏం తీసిపోదు. కామెడీ, పొలిటికల్ జానర్ లో తెరకెక్కకుతుంది. ఇవాళ విడుదల చేసిన పోస్టర్ ద్వారా ఈ సినిమాను అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను నిర్మాత దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ విడుదల చేస్తోంది. దిల్ రాజు విడుదల చేస్తున్నాడంటే.. సినిమాలో కచ్చితంగా కంటెంట్ అదిరిపోవడం ఖాయం. అంతేకాకుండా యోగిబాబు మండేలా సినిమా ద్వారా కెరీర్ బెస్ట్ యాక్టింగ్ చేశాడని టాక్. దాన్నే సంపూ రిపీట్ చేస్తాడా? తన కెరీర్ ను ఈ సినిమా ద్వారా మలుపు తిప్పుకోగలుగుతాడా? చూడాలి.



Tags:    

Similar News