Animal Review: యానిమల్ సినిమా ట్విట్టర్ రివ్యూ

Byline :  Bharath
Update: 2023-12-01 07:26 GMT

అర్జున్ రెడ్డి సినిమా తర్వాత దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నరు డైరెక్టర్ సందీప్ వంగ. అదే సినిమాను హిందీలో కబీర్ సింగ్ పేరుతో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అంతటి డైనమిక్ డైరెక్టర్ చాలా గ్యాప్ తర్వాత తెరెకక్కిన సినిమా యానిమల్. బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందనా జంటగా వస్తున్న ఈ సినిమాపై ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ అభిమానుల్ని ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచనాలను తారా స్థాయికి తీసుకెళ్లాయి. ట్రైలర్ అరాచకంగా ఉండటంతో.. అంతా సినిమా భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాగా ఇవాళ సినిమా రిలీజ్ అయింది. ఓవర్సీతో పాటు దేశంలో కూడా చాలా థియేటర్లలో ఫస్ట్ షోలు పడిపోయాయి. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

యానిమల్ కు సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. చాలామంది సినిమా అంచనాలను అందుకుంది అని చెప్తున్నారు. రణ్‌బీర్‌, రష్మిక, బాబీ డియోల్‌, అనిల్‌ కపూర్ ల నటన సూపర్ గా ఉందని, సినిమా ఒక ఎమోషనల్ రైడ్ అని చెబుతున్నారు. కాగా మరికొందరు సినిమాలో వైలెన్స్ ఎక్కువగా ఉందని, రిలీజ్ కు ముందు సందీప్ వంగ చెప్పినట్లే వైలెన్స్ అంటే ఏంటో చూపించారని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ పాయింట్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు ఫస్ట్ ఆఫ్ చాలా బాగుందని, రణ్ బీర్ కపూర్ యాక్టింగ్ లో అదరగొట్టినట్లు చెప్తున్నారు. మాస్ యాటిట్యూడ్ పాత్రకు రణ్ బీర్ ఒదిగిపోయినట్లు చెప్తున్నారు. సందీప్ వంగ టేకింగ్ అద్భుతంగా ఉందని, ఒక్కమాటలో చెప్పాలంటే.. యానిమల్ బ్లాక్ బస్టర్ సినిమా అని అంటున్నారు.






Tags:    

Similar News