ఐశ్వర్య, ధనుష్‌ డివోర్స్‎కి ఆ స్టార్ నటుడే కారణమా?

By :  Aruna
Update: 2023-09-21 07:17 GMT

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య, నటుడు ధనుష్‌ లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికీ ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే కొన్ని మనస్పర్థల కారణంగా ఈమధ్యనే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అయితే ఇన్నాళ్లు అన్యోన్యంగా ఉన్న వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారు అనేదానిపై ప్రజల్లో ఓ సందేహం ఉండేది. చాలా ఏళ్ల తర్వాత ఐశ్వర్య గురించిన ఓ నిజం ఇప్పుడు ఇంటర్నెట్‎ను షేక్ చేస్తోంది. అప్పట్లో రజనీకాంత్ కుమార్తె స్టార్ హీరో శింబుతో ప్రేమాయణం నడిపిందట. అదే రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శింబు కారణంగానే వీరిద్దరూ డివోర్స్ తీసుకుని ఉంటారనే టాక్ కోలీవుడ్ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది. దీంతో ఐశ్వర్య, ధనుష్‌ డివోర్స్‎ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

స్టార్ సెలబ్రిటీల పర్సనల్ రిలేషన్‎షిప్‎కు సంబంధించి ఏ చిన్న లీక్ దొరికినా సోషల్ మీడియా అల్లుకుపోతుంది. తాజాగా ఐశ్వర్య, ధనుష్‌ డివోర్స్‎కి సంబంధించిన అలాంటి రూమరే నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. గతంలో ఐశ్వర్య కోలీవుడ్ స్టార్ హీరో శింబు ప్రేమించుకున్నారట. అయితే ఏమైందో ఏమిటో వీళ్లిద్దరి మధ్య విబేధాలు రావడంతో బ్రేకప్ చెప్పుకున్నారట. ఇక శింబు మీద ఉన్న కోపంతోనే ఐశ్వర్య ధనుష్‌ను పెళ్లాడినట్లు కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. అంతే కాదు ధనుష్‌కు, శింబు అంటే పడకపోవడానికి ఇదే కారణమా? అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే డివోర్స్ తర్వాత ధనుష్ ప్రస్తుతం ఓ స్టార్ నటితో డేటింగ్ చేస్తున్నాడట. అంతే కాదు ఆమె ప్రస్తుతం ధనుష్ ఇంట్లోనే ఉంటోందని సమాచారం. మరి ఈ వార్త ఎంత వరకు వాస్తవం అనేది ధనుష్ రివీల్ చేసే వరకు ఎదురుచూడాల్సిందే.

Secret Reason behind Dhanush, Aishwaryaa Rajinikanth Divorce

Aishwarya, Dhanush, Divorce, Telugu News, Tamilnadu, social media, Kollywood, cinema news, Tamil movies, latest news, Star actor, South Star actor, entertainment, Dhanush Divorce, Rajinikanth, Tamil Star Dhanush, Simbu, Silambarasan TR, Tamil cinema, Film industry

Tags:    

Similar News