లేటు వయసులో సీనియర్ నటుడి హనీమూన్..నెటిజన్స్ ట్రోలింగ్

Update: 2023-07-11 09:37 GMT

సీనియర్ నటుడు ఆశిష్‌ విద్యార్థి గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. దక్షిణాదితో పాటు ఉత్తరాదిన మంచి నటుడిగా గుర్తింపు పొందారు ఈయన. 11 భాషల్లో ఏకంగా 200కిపైగా సినిమాల్లో నటించారు. తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. పోకిరి సినిమాతో టాలీవుడ్‎లో ఎంట్రీ ఇచ్చారు ఆశిష్. ఈ సినిమా హిట్ కావడంతో పాటు ఆశిష్ కారెక్టర్ కూడా అందరికి కనెక్ట్ అయ్యింది. నెగిటివ్ షేడ్ పాత్రలతో బాగా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం సినిమాలతో పాటు తన ఓన్ ఫుడ్ యూట్యూబ్ ఛానెల్ రన్ చేస్తున్నారు. అయితే ఈ మధ్యనే




 


ప్రేమకు వయసుతో సంబంధం లేదని 57ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు ఆశిష్ విద్యార్థి. తనకంటే 24 ఏళ్ల  చిన్నదైన అస్సాంకు చెందిన ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌ రూపాలిని పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పటికే మొదటి భార్యకు ఓ కుమారుడు కూడా ఉన్నారు. కోల్‌కతాలో జరిగిన వీరి పెళ్లికి అత్యంత సన్నిహితులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు.




 


అయితే తాజాగా ఈ జంట తమ హనీమూన్ ట్రిప్‌లో ఉన్నారు. ఇండోనేషియాలో బాలిలో ఈ జంట ఎంజాయ్ చేస్తోంది. అందమైన ప్రదేశాలను చుడుతూ అక్కడి వీధుల్లో చక్కర్లు కొడుతుతున్నారు. వీరి వెకేషన్ కు సంబంధించిన పిక్స్ ను రూపాలి తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. గ్రీనరీ , ఆహ్లాదకరమైన కొండల మధ్య దిగిన ఫోటోను పంచుకుంది. జూన్ నెలలో కూడా ఈ జంట సింగపూర్‌లో విహారయాత్రకు వెళ్లింనట్లు టాక్. ఇదిలా ఉంటే లేటు వయసులో పెళ్లి చేసుకోవడంతో ఆశిష్‎ను నెటిజన్స్ ట్రోల్స్‌ చేస్తున్నారు. ఈ వయసులో ఇది అవసరమా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.




 








Tags:    

Similar News