Udhayanidhi Stalin : అయోధ్య రామాలయ నిర్మాణంపై.. ఉదయనిధి సంచలన వ్యాఖ్యలు

Update: 2024-01-19 05:07 GMT

అయోధ్య రామమందిర నిర్మాణానికి వ్యతిరేకం కాదని మసీదు పడగొట్టి మందిరం నిర్మించడాన్ని ఏకీభవించలేమని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ తెలిపారు. చెన్నైలో మీడియ సమావేశంలో మాట్లాడారు. దివగంత ముఖ్యమంత్రి కరుణానిధి కూడా ఇదే విషయం చెప్పేవారన్నారు. ఆధాత్మికతను రాజకీయాలతో ముడిపెట్టడం మంచిది కాదన్నారు. గతంలో హిందూ సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చి వివాదానికి తెరతీసిన ఉదయనిధి మరోసారి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనవరి 22న అయోధ్యలో శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన మహోత్సవం జరగనుంది. రాముడి పవిత్ర విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకపై దేశవ్యాప్తంగా భక్తుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ వేడుకకు అయోధ్యలో భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. ఉదయనిధి కామెంట్స్ పై డీఎంకే, బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. దేశంలోని 80 శాతం మంది హిందువుల జనాభా నాశనమైందని డీఎంకే నేతలు మాట్లాడుతున్నారని బీజేపీ నేత అమిత్ మాలవీయ అన్నారు. కాగా తాజాగా ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. పాట్నా ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు దీనికి సంబంధించి కాగ్నిజెన్స్ లెటర్ జారీ చేసింది. ఫిబ్రవరి 13న కోర్టుకు హాజరు కావాలని ఉదయనిధిని కోర్టు ఆదేశించింది.




Tags:    

Similar News