జాగ్రత్త.. నయనతార భర్తకు షారుఖ్ స్వీట్ వార్నింగ్

Update: 2023-07-12 17:11 GMT

తమిళ స్టార్ డైరెక్టర్‌ అట్లీ తెరకెక్కించిన తాజా చిత్రం జవాన్. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ హీరోగా రూపొందిన ఈ మూవీలో లేడీ సూపర్‌స్టార్ నయనతార ఫిమేల్ లీడ్‌గా నటించింది. డైరెక్టర్‌తో పాటు నయన్‌కు బాలీవుడ్లో ఇదే ఫస్ట్ మూవీ. ఇక ఇటీవలే విడుదలైన జవాన్ ట్రైలర్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఈ క్రమంలోనే నయనతార భర్త విఘ్నేష్ శివన్‌ జవాన్‌ టీమ్‌కు విషెస్ తెలిపారు.

జవాన్‌ ట్రైలర్‌ బాగుందంటూ విఘ్నేష్ శివన్‌ ఆనందం వ్యక్తం చేశారు. ‘‘ఇలాంటి బిగ్గెస్ట్ చిత్రంతో అట్లీ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నందుకు గర్వంగా ఉంది. ట్రైలర్‌ ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంది. షారుఖ్‌ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాలనే నా సతీమణి నయన్‌ కల నెరవేరింది. టీమ్‌ మొత్తానికి నా అభినందనలు’’ అని విఘ్నేష్ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు.

విఘ్నేష్ పోస్టుకు షారఖ్ ఫన్నీగా స్పందించారు. ‘‘ విఘ్నేష్‌.. మా సినిమాపై మీరు చూపిస్తోన్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. నయన్‌ అద్భుతమైన వ్యక్తి. మీకు ఇప్పటికే ఈ విషయం తెలుసు కదా. ఇటీవల ఆమె కొన్ని కీలకమైన పంచ్‌లు నేర్చుకున్నారు. కాబట్టి మీరు జాగ్రత్త’’ అని ఫన్నీ కామెంట్ చేశారు. దీంతో షారుఖ్ ట్వీట్ వైరల్గా మారింది.

షారుఖ్ పఠాన్ మూవీ తర్వాత జవాన్ వస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో విజయ్‌ సేతుపతి, దీపికా పదుకొణె, ప్రియమణి కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్‌ 10న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై షారుఖ్ వైఫ్ గౌరీ ఖాన్ నిర్మించారు.


Tags:    

Similar News