మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ సక్సెస్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ లో శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్ ఖచ్చితంగా ఉంటుంది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మున్నాభాయ్ ఎమ్.బి.బి.ఎస్ కు రీమేక్ గా వచ్చినా.. తెలుగులో మెగాస్టార్ ఇమేజ్ కు, కామెడీ టైమింగ్ కు పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేస్తూ దర్శకుడు జయంత్ సి పరాన్జీ అద్భుతంగా రీ రైట్ చేశాడు. దేవీ శ్రీ ప్రసాద్ సాంగ్స్ అన్నీ బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇక ఒక రౌడీ దొంగదారిలో ఎమ్.బి.బి.ఎస్ చదువుతూ.. ఆ కాలేజ్ డీన్ తో కావాలనే గొడవ పెట్టుకుని.. అతని కూతురు అని తెలియక డాక్టర్ సునితతో లవ్ లో పడటం.. అనే కాన్సెప్ట్ కు హ్యూమన్ టచ్, సెంటిమెంట్,లవ్, యాక్షన్, కామెడీ, స్వీట్ రివెంజ్.. ఇలా అన్ని అంశాలూ కలబోసిన ఈ సినిమా తెలుగులో కూడా బాలీవుడ్ ను మించిన విజయం సాధించింది. ఇప్పటికీ చాలామందికి చాలా ఇష్టమైన సినిమాగా ఉన్న శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్ ను రీ రిలీజ్ చేయబోతున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ కు ఊపులో ఉంది. ఆ ఊపులోనే మెగాస్టార్ మూవీని రీ రిలీజ్ చేయబోతున్నారు. నవంబర్ 4న ఈ చిత్రం మళ్లీ విడుదల కాబోతోంది. ఇప్పటికే టివిల్లో ఎన్నోసార్లు చూసి ఉన్నారీ సినిమాను. అయినా థియేటర్స్ లో మళ్లీ ఆ సందడి కనిపిస్తుందా లేదా అనేది చూడాలి.