‘ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి’.. పక్కా చూడాల్సిన మూవీ

Byline :  Shabarish
Update: 2024-03-14 11:19 GMT

తెలంగాణ నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అందులో బలగం మూవీ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇప్పుడే అదే కోవలోకి మరో చిత్రం రాబోతోంది. టాలీవుడ్ హీరో చైతన్య రావ్, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం 'షరతులు వర్తిస్తాయి'. ఈ మూవీ స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందింది. రేపు ఈ మూవీ గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ సినిమాకు సెన్సార్ నుంచి క్లీన్ 'యు' సర్టిఫికెట్ లభించింది.

మానవీయ విలువలతో కూడిన ఓ మంచి సినిమాను రూపొందించారంటూ సెన్సార్ సభ్యుల నుంచి ఈ మూవీకి ప్రశంసలు దక్కాయి. డైరెక్టర్ కుమారస్వామి కూడా సెన్సార్ బోర్డు సభ్యుడే కావడం విశేషం. ఇంత గొప్ప సినిమాను తీయడం పట్ల సెన్సార్ సభ్యులు సైతం ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ విడుదలై అందర్నీ ఆకట్టుకున్నాయి. తెలంగాణ సినిమా అంటే ఇప్పటి వరకూ మట్టిపరిమళాలు, కన్నీటి కథలు, పోరాటాలు, సాంప్రదాయాలు మాత్రమే చూశాం. కానీ 'షరతులు వర్తిస్తాయి' కథ వేరు.

సమస్యకు భయపడకుండా ఎదురించి నిలబడే స్ఫూర్తిని 'షరతులు వర్తిస్తాయి' కలిగిస్తుంది. కరీంనగర్ నేపథ్యంలో సాగే ఈ కథ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకోనుంది. సమస్య వచ్చినప్పుడు హీరో చేసే ప్రయత్నాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. కన్నీళ్లతో బాధపడేవారికి ఈ మూవీ భుజం తట్టి ధైర్యం చెప్పే ఓ స్నేహితుడిలా మారనుంది. హీరో చైతన్య రావ్, హీరోయిన్ భూమి శెట్టిలు అద్భుతంగా నటించిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అద్భుతమైన కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'షరతులు వర్తిస్తాయి' టీమ్‌కు ఆల్ ది బెస్ట్.

Tags:    

Similar News