అట్లీ దర్శకత్వంలో షారూఖ నటించిన సినిమా జవాన్. నయనతార, దీపికా పడుకోన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయింది. ఎవరు నేను మంచివాడినా, చెడ్డవాడినా అంటూ షారూఖ్ చెప్పిన డైలాగ్ లతో వచ్చిన ట్రైలర్ అదరగొడుతుంది. పవర్ ప్యాక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న జవాన్ హిట్ అవడం ఖాయంలా కనిపిస్తోంది.
జవాన్ ట్రైలర్...అందులో డైలాగ్ లు, సన్నివేశాలు చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. బోలెడు గెటప్ లలో కనిపిస్తున్న షారూఖ్ ఈ సారి సినీ ప్రియులకు మంచి ట్రీట్ ఇస్తున్నట్లు అనిపిస్తోంది. ఇది ఆరంభం మాత్రమే...నేను విలనైతే నా ముందు ఏ హీరో నిలబడలేడు అన్న డైలాగ్ అయితే కేకలా ఉంది. సినిమా థియేటర్లో ఈ డైలాగ్ విజిల్స్ వేయించడం ఖాయం అంటున్నారు. తమిళ దర్శకుడు అట్లీ తీసిన జవాన్ పక్కా కమర్షియల్ మూవీగా మన ముందుకు వస్తోంది. తమిళ, హిందీ, తెలుగు భాషల్లో సెప్టెంబర్ 7న విడుదల అవుతున్న ఈ సినిమాను షారూఖ్ స్వయంగా నిర్మించారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ లో, గౌరీఖాన్ సమర్పిస్తున్న సినిమా ఇది.
చీరకట్టులో దీపికా, మోడ్రన్ లుక్ లో నయనతార మెరిపించారు ట్రైలర్లో. ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు. మామూలుగా షారూఖ్ సినిమాలంటే పిచ్చ క్రేజ్ ఉంటుంది. అలాంటిది ఇంత పవర్ ప్యాక్డ్ సినిమా అయితే జనాలు ఇంకా ఎక్కువ చూస్తారని అంటున్నారు సినీప్రియులు. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్... జవాన్ మూవీకి అదనపు ఆకర్షణ గా నిలవనుంది.