అంగరంగ వైభవంగా శర్వానంద్ వివాహ వేడుక

శర్వానంద్ వెడ్స్ రక్షిత;

Update: 2023-06-04 07:38 GMT



టాలీవుడ్‌ యంగ్ హీరో శర్వానంద్ ఓ ఇంటివాడయ్యాడు. ఈ ఏడాది జనవరి 26న సడెన్‌గా ఎంగేజ్మెంట్ చేసుకొని అందర్నీ సర్‌ప్రైజ్ చేసిన ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్.. శనివారం రాత్రి జైపూర్ లోని లీలా ప్యాలెస్‌లో తన మనసుకి నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. మాజీ మంత్రి , టీడీపీ నేత స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి మనవరాలు, హైకోర్టు లాయర్ మధుసూధనా రెడ్డి కూతురు రక్షిత రెడ్డి మెడలో మూడు ముళ్లు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు.




 


జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో శర్వా అండ్ రక్షిత వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. జూన్ 2న ఉదయం హల్దీ ఫంక్షన్ జరగగా, అదే రోజు రాత్రి సంగీత్ వేడుక జరిగింది. శర్వా పెళ్లి వేడుకలకు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇక జూన్ 3 రాత్రి 11 గంటలకు శర్వానంద్ వివాహం జరిగింది. శర్వా పెళ్లి వేడుకకు రామ్‌ చరణ్‌తో పాటు పలువురు టాలీవుడ్‌ సినీ, రాజకీయ నాయకులు హాజరయ్యారు. రెండు రోజుల పాటు సాగిన ఈ వివాహ వేడుక కోసం లీలా ప్యాలెస్‌ను అందంగా ముస్తాబు చేశారు. హీరో సిద్దార్థ్, నిర్మాత వంశీ, అనురాగ్, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు. ఇక ఇరువైపులా బంధువులు, సన్నిహితులు కూడా విచ్చేయగా పెళ్లి ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.




 





Tags:    

Similar News