Shilpa Shetty- Raj Kundra Divorce : 'మేం విడిపోయాం.. ' శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ట్వీట్
తాము విడిపోయామంటూ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రా ట్విటర్‌లో పెట్టిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. 'మేము విడిపోయాం.. దయచేసి ఈ కష్ట సమయం నుంచి బయటపడేందుకు కొంత సమయం ఇవ్వండి' అని ట్విటర్‌లో రాసుకొచ్చాడు. దీనికి గుండె ముక్కలైన ఎమోజీతో పాటు చేతులు జోడిస్తున్న గుర్తును జత చేశాడు. అర్థరాత్రి ఒంటి గంట సమయంలో ఆయన ఈ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరలవుతుండగా.. వీరిద్దరి నిజంగానే విడిపోయారా ?.. విడిగా అంటే డివోర్స్ తీసుకున్నారా ?.. అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
మరికొందరు మాత్రం రాజ్ కుంద్రా చేసిన ట్వీట్ విడాకుల గురించి కాదని.. ఇన్నాళ్లు తనతో ఉన్న మాస్క్ గురించి చెప్పాడని..ఇకపై మాస్క్ ఉపయోగించనని ఇలా ట్వీట్ చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు శిల్పా శెట్టి సోషల్ మీడియా ఖాతాలలో విడాకులకు సంబంధించిన ఎలాంటి పోస్టులు కనిపించడం లేదు. అంతేకాదు.. ఆమె గురువారం తన భర్త కొత్త సినిమా UT69 పోస్ట్ చేస్తూ… రాజ్ కుంద్రాకు బెస్ట్ విషెస్ తెలిపింది. దీంతో వీరిద్దరు విడిపోవడం లేదని.. కేవలం రాజ్ కుంద్రా మాత్రమే మాస్క్ గురించి ట్వీట్ చేశాడనే క్లారిటీ వస్తోంది.
కాగా 2021లో నీలిచిత్రాల కేసులో అరెస్టయిన రాజ్‌కుంద్రా కొంతకాలంపాటు జైలు జీవితం గడిపాడు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మీడియాకు తన ముఖం చూపేందుకు కూడా ఇష్టపడలేదు. ఎప్పుడు బయటకు వచ్చినా ఏదో ఒక మాస్క్‌తోనే కనిపించేవాడు. బహుశా మాస్క్‌తో ఇక సంబంధం లేదని ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక UT69 నవంబర్ 3న విడుదల కానుంది. కాగా రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టి 2009లో పెళ్లి చేసుకున్నారు. వీరికి వియాన్, సమీషా అని ఇద్దరు సంతానం.
We have separated and kindly request you to give us time during this difficult period 🙏💔
— Raj Kundra (@onlyrajkundra) October 19, 2023