Shine Tom Chacko:ప్రేయసిని పెళ్లాడబోతున్న 'దసరా' విలన్'
ప్రముఖ మలయాళ నటుడు, 'దసరా' విలన్ షైన్ టామ్ చాకో త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారు. ఫేమస్ మోడల్ తనూజతో గత కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉన్న టామ్ చాకో.. ఇప్పుడు మ్యారేజ్ లైఫ్‌ని స్టార్ట్ చేయబోతున్నాడు. తాజాగా జనవరి 1 న వీరిద్దరి నిశ్చితార్థం వేడుక జరిగింది. చాలా దగ్గరి బంధువులు, స్నేహితుల మధ్యలో షైన్, తనూజ కు ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగాడు షైన్. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జరిగిన ఈ ఎంగేజ్‍మెంట్ వేడుకకు సంబంధించిన ఫొటోలను చాకో మంగళవారం సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. చాలా మంది సినీ సెలెబ్రిటీలు శుభాకాంక్షలు చెప్పారు. అభిమానులు, నెటిజన్లు కూడా ఈ జంటకు విషెస్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.
అతి తక్కువ మంది సన్నిహితులు, స్నేహితుల మధ్యే వీరి నిశ్చితార్థం జరిగింది. అదే విషయాన్ని టామ్ చాకో సోషల్ మీడియా వేధికగా ప్రకటిస్తూ.. తమ ఫొటోలను షేర్ చేశాడు. అందులో ఈ బ్యూటిఫుల్ కపుల్ చాలా అందంగా కనిపిస్తున్నారు. వైట్ అండ్ బేబీ పింక్ కాంబోలో వీరిద్దరూ సేమ్ డ్రెస్ లు వేసుకున్నారు. చాలా అందంగా ముస్తాబై తమ స్పెషన్ మూమెంట్ ను మరింత స్పెషల్ గా మలుచుకున్నారు. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జనవరిలోనే లేదా ఫిబ్రవరిలోనో వీరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారని టాక్ నడుస్తోంది.
తన అద్భుతమైన నటనతో అందరినీ అలరిస్తూ... వరుస చిత్రాల్లో ఛాన్స్‌లు కొట్టేస్తున్న టామ్.. మన తెలుగు ప్రేక్షకులకు 'చిన్న నంబీ' గా ఫేమస్. గతేడాది న్యాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన దసరా సినిమాలో 'చిన్న నంబీ' పాత్రలో క్రూరమైన విలన్‌గా నటించాడు. ఈ మూవీలో పూర్ణ భర్తగా.. ఉమెనైజర్ గా టామ్ చాకో పాత్ర ఆకట్టుకుంటుంది. విలన్ గా అతని హావభావాలు అద్బుతం అని చెప్పాలి. 1984లో పుట్టిన షైన్ టామ్ చాకో ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం 40 ఏళ్ల వయసు కల్గిన కెరియర్ పరంగా దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవరలో విలన్ గా కనిపించబోతున్నారు. మరి దేవరలో ఏ రేంజ్ లో ఎన్టీఆర్ ను ఢీకొంటారో చూడాలి.