డ్రగ్స్ కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు.. పోలీసుల ఎదుట హాజరైన లిషిత

Byline :  Shabarish
Update: 2024-03-04 05:43 GMT

రాడిసన్ హోటల్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నీల్ విదేశాలకు పరార్ అవ్వడంతో నీల్ కోసం లుకౌట్ నోటీసులను కోర్టు జారీ చేసింది. పరారీలో ఉన్న ఐదుగురు హైకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రగ్స్ పెడ్లర్ వహీద్‌ను కస్టడీకి తీసుకుంటామని కోర్టును కోరుతున్నారు. తాజాగా ఈ కేసులో నిందితురాలిగా ఉన్న లిషిత పోలీసు ఎదుట హాజరైంది.

సోషల్ మీడియాలో పాపులర్ అయ్యి హీరోయిన్‌గా సినిమాలు చేస్తున్న కుషిత సిస్టరే లిషిత. పోలీసులు ఆమెను మైనర్‌గా గుర్తించారు. డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చాక ఆమె కనిపించకుండా పోయినట్లు కుషిత పోలీసులకు తెలిపింది. చెల్లి ఆచూకీ లభించడం లేదని గచ్చిబౌలి పోలీసులకు ఆమె ఫిర్యాదు కూడా చేసింది. డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చాక లిషిత ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె ఇంటికా రానే లేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోందని కుషిత చెబుతోంది.

తాజాగా లిషిత గచ్చిబౌలి పోలీసుల ఎదుట హాజరైంది. ఈ కేసులో లిషితను ఏ8గా పోలీసులు చేర్చిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసుకు సంబంధించి విచారణకు వచ్చిన లిషిత నుంచి యూరిన్, బ్లడ్ శాంపిల్స్‌ను పోలీసులు సేకరించారు. వైద్య పరీక్షలకు ఆ శాంపిల్స్‌ను పంపించారు. మరోవైపు డైరెక్టర్ క్రిష్ కూడా యూరిన్, బ్లడ్ శాంపిల్స్ ఇచ్చారు. ఆయన బ్లడ్ టెస్ట్ రిపోర్టులు ఈ రోజు వచ్చే అవకాశం ఉంది. అలాగే క్రిష్‌ను పోలీసులు మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది.


Tags:    

Similar News