కీరవాణిని వెంటాడిన ‘చంద్రముఖి 2’..రెండు నెలలు పడుకోలేదని ట్వీట్

By :  Kiran
Update: 2023-07-24 06:06 GMT

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ , ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి ఎలాంటి పాటకైనా సెకెండ్స్‎లో అద్భుతమైన బాణీలను సమకూర్చగలరు . అలాంటిది ఆయన గత రెండు నెలలుగా ఓ సినిమా కోసం పగలు, రాత్రి అన్న తేడా లేకుండా బాణీలను కూర్చుతూ నిద్రలేమితో సతమతమయ్యారట. తనను ఏ శక్తి అంతలా వెంటాడిందో తాజాగా ఓ ట్వీట్‌లో తెలిపారు కీరవాణి.

ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ సీనియర్ సంగీత దర్శకుడు కీరవాణి గారి ప్రతిభ విశ్వవ్యాప్తంగా విస్తరించింది. ఈ మూవీలో ఈయన స్వరపరిచిన నాటు నాటు పాటకు అందరూ ఫిదా అయిపోయారు. నాటు నాటు అంటూ ప్రపంచమంతా ఆడిపాడిందంటే ఆయన టాలెంట్ ఏపాటితో అర్థం చేసుకోవచ్చు. ఆస్కార్‏తో సహా ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులను సొంతం చేసుకున్నారు కీరవాణి. ఆర్ఆర్ఆర్ మానియా తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న కీరవాణి మళ్లీ ట్రాక్‎లోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేస్తున్న ‘హరి హర వీరమల్లు, లారెన్స్ మూవీ చంద్రముఖి 2 కు మ్యూజిక్‎ను అందిస్తున్నారు . రాసెంట్‎గానే ‘చంద్రముఖి 2’ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం రీరికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో కీరవాణి ఈ సినిమాలోని ప్రతి పాత్రకు ప్రాణం పోసేందుకు ఎంతలా కష్టపడ్డారో తన ట్విటర్ అకౌంట్ ద్వారా అనుభవాలను పంచుకున్నారు.

" చంద్రముఖి 2లోని పాత్రలు మరణ భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతాయి. ఈ సినిమాలో ఎన్నో అద్భుతమైన మైండ్‌బ్లోయింగ్ సీన్లు ఉన్నాయి. వాటికి నా మ్యూజిక్‌తో ప్రాణం పోసేందుకు నిర్విరామంగా 2 నెలలు సమయం కేటాయించాను. ఈ రెండు నెలలు నిద్రలేని రాత్రులు, పగళ్లు గడిపాను. గురుకిరణ్, ఫ్రెండ్ విద్యాసాగర్.. నాకు సక్సెస్ రావాలని కోరుకోండి"అని కీరవాణి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ద్వారా ‘చంద్రముఖి 2’ బ్యాక్‌‌గ్రౌండ్ స్కోర్ కోసం కీరవాణి రెండు నెలలు కష్టపడ్డారని చెప్పకనే చెబుతున్నారు. అయితే వీరిద్దరి పేర్లను ఎందుకు జోడించారనే టాక్ వినిపిస్తుంది. అందుకు కారణం లేకపోలేదు. చంద్రముఖి సినిమాకు విద్యాసాగర్ సంగీతాన్ని అందించారు. ఆ తరువాత వచ్చిన నాగవల్లికి గురు కిరణ్ స్వరాలు స్వరపరిచారు. ఈ జోనర్ సినిమాలకు తనకంటే ముందే సంగీతాన్ని ఇవ్వడం వల్లే కీరవాణి తన ట్వీట్‌లో వీరిద్దరినీ తలచుకున్నట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News