డార్లింగ్ ప్రభాస్‎తో సీతారామమ్ డైరెక్టర్ భారీ ప్రాజెక్ట్ కన్ఫార్మ్

Update: 2023-07-04 08:22 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం నాలుగైదు ప్రాజెక్టులు ఉన్నాయి. ఆదిపురుష్ కథ అడ్డం తిరిగినా, ఏమాత్రం జోష్ తగ్గకుండా ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో మునిగిపోయాడు. డార్లింగ్ ప్రస్తుతం యాక్ట్ చేస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియన్ లెవెల్‏లో భారీ బడ్జెట్‎తో తెరకెక్కుతున్నవే. అన్నీ కూడా స్టార్ డైరెక్టర్ల సినిమాలే కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే బాహుబలి తర్వాత డార్లింగ్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడుతుండటంతో ఫ్యాన్స్ ప్రస్తుతం నిరాశలో ఉన్నారు. ప్రేమకథా చిత్రం డార్లింగ్ తరువాత.. ప్రభాస్ పూజా హెగ్డేతో కలిసి రాధేశ్యామ్ చేశాడు. అయితే ఈ సినిమా పెద్ద డిజాస్టర్‎గా మిగిలింది. ఈ క్రమంలోనే ప్రభాస్ నుంచి మరో అందమైన లవ్ స్టోరీని ఎక్స్‎పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అందుకేనేమో ఇప్పటికే వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్..లేటెస్టుగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రభాస్, సీతారామం సినిమాతో లేటెస్టుగా హిట్ అందుకున్న డైరెక్టర్ హనుతో ఓ భారీ ప్రాజెక్ట్ కన్ఫార్మ్ చేశాడు. డెరెక్టరే అధికారికంగా తన ట్విటర్ అకౌంట్‎లో ఈ విషయాన్ని ప్రకటించాడు.

గతేడాది విడుదలైన సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ హను రాఘవపూడి. ఈ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. సీతారామం వంటి మరో అందమైన ప్రేమకథను ఓ పాన్ ఇండియన్ స్టార్‎తో తీయాలని హను ఎప్పటినుండో ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు స్టార్లకు కథలను రెడీ చేశాడు. అదే సమయంలో డార్లింగ్ ప్రభాస్‎ను కలిసి.. ఓ ప్రేమకథ వినిపించాడని.. దానికి యంగ్ రెబల్ స్టార్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని టాక్ వినిపించింది. రాధేశ్యామ్ తర్వాత వరసగా సీరియస్ సినిమాలే చేస్తోన్న ప్రభాస్, మరోసారి లవ్ స్టోరీ చేయాలని అనుకుంటున్నారట. అందుకే హనుతో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడని తెలుస్తోంది. ప్రభాస్ తో సినిమా చేసే లక్కీ ఛాన్స్ రావడంతో హను తన ట్విటర్ అకౌంట్ లో మా డార్లింగ్ ప్రభాస్ గారితో కలిసి పనిచేయడం నా డ్రీమ్ ప్రాజెక్ట్, ఎంతో సంతోషంగా ఉందని తన భావాలను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో హనుతో ప్రభాస్ సినిమా వస్తుందనే వార్త తెలియడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. మరి హను ప్రభాస్‎తో చేసేది లవ్ స్టోరీనా లేదా అన్నది మాత్రం అక్టోబర్‎లో తెలిసే ఛాన్స్ ఉంది.


Tags:    

Similar News