ఓటీటీలోకి స్లమ్ డాగ్ హస్బెండ్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..?

Update: 2023-08-23 10:03 GMT

సరికొత్త కాన్సెప్ట్తో వచ్చి సూపర్ హిట్ కొట్టిన సినిమా స్లమ్ డాగ్ హస్బెండ్. కుక్కని పెళ్లి చేసుకోవడం వల్ల హీరో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, జీవితం ఎంత గందరగోళంగా మారిపోయిందనే క్రేజీ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్తో దూసుకెళ్లింది. బ్రహ్మాజి తనయుడు సంజయ్, ప్రణవి మానుకొండ హీరోహీరోయిన్లుగా నటించారు. ఏఆర్ శ్రీధర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని.. మైక్ మూవీస్ బ్యానర్పై అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించారు.

జులై 29న రిలీజ్ అయిన ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా.. తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ను కూడా ప్రకటించారు. గురువారం నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లోస్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు.

సినిమా ఒకవైపు ఫన్ వేలో సాగుతూనే సమాజంలో మూడ నమ్మకాలకు ప్రశ్నించేలా, సెటైర్లు వేసేలా ఉంటుంది. ప్రజల నమ్మకాలు, ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు చేసే హడావుడు వంటి వాటిని ఫన్నీవేలో చూపించారు. ఎమోషనల్‌గా సాగే క్లైమాక్స్ సీన్స్ ఆకట్టుకున్నాయి. జంతువులు చూపే ప్రేమ, విశ్వాసం గురించి చెప్పిన తీరు బాగుంది.

Tags:    

Similar News