కాబోయే భర్త గురించి పెదవి విప్పిన శోభితా ధూళిపాళ్ల

Update: 2023-06-21 14:27 GMT

హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల తన మనసులో మాట బయటపెట్టింది. తన పెళ్లిపై స్పందించింది. తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది. ది నైట్ మేనేజర్-2 ప్రమోషన్లో భాగంగా.. ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభితా.. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో వివరించింది. ‘జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి. సింప్లిసిటీకి కేరాఫ్ అయి ఉండాలి. మంచి మనసు, ఇతరుల పట్ల దయ కలిగి ఉండాలి. ప్రకృతిని ప్రేమించాలి. ఈ జీవితం చాలా చిన్నది. అందుకే ప్రతీక్షణం ఆస్వాధించాలి. అలాంటివాడు తనకు కావాలని’ శోభితా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ హీరోతో తాను రిలేషన్షిప్ లో ఉన్నట్లు వస్తున్న రూమర్స్ పై స్పందించిన శోభితా.. ఆ వార్తలపై బాధపడట్లేదన్నారు. ప్రేక్షకులు ఇలాంటి విషయాలు కాకుండా.. తన వర్క్ లైఫ్ గురించి మాట్లాడాలని, తను ఇండస్ట్రీకి రావడానికి పడ్డ కష్టాన్ని గుర్తిస్తే బాగుంటుందని చెప్పుకొచ్చింది.






 



 



 


Tags:    

Similar News