కేక పుట్టిస్తున్న మిస్టర్ ప్రెగ్నెంట్.. దూసుకుపోతున్న ట్రైలర్

Update: 2023-08-12 11:34 GMT

కథలో పట్టు, కథనంలో కొత్తదనం ఉంటే ఏ సినిమా అయినా జనానికి నచ్చుతుందని తెలుగు ప్రేక్షకులు నిరూపిస్తుంటారు. భారీ బడ్జెట్, భారీ తారాగణంతో సంబంధంలేకుండా మంచి కాన్సెప్ట్‌తో అలరిస్తే చాలు పట్టం కడతారు. మైక్ మూవీస్ కొత్త చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ను జనం దగ్గరికి తీసుకున్నారు. యూట్యూబ్‌లోని ఈ మూవీ ట్రైలర్ ఆరురోజుల్లోనే 5 మిలియన్ల వ్యూస్ సాధించి దూసుకుపోతోంది. ‘స్టోరీలైన్ బావుంది. ఇలాంటి కథలే కావాలి’’ అని కొందరు కోరుతుంటే, ఇంట్లోవారితో కలసి ట్రైలర్ చూశామని అందరికీ నచ్చిందని కొందరు చెబుతున్నారు. ‘‘బిడ్డకు జన్మనివ్వడం అంత ఈజీ కాదు. ఆ వేదన మగవాడు పడితే ఎలా ఉంటేందో ట్రైలర్లోనే చక్కగా చూపారు. మూవీకోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాం’’ అని వీక్షకులు ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘హే చెలి’, ‘ఏమైనదో’ పాటలు కూడా యూట్యూబ్‌ వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

 Full View

బిగ్‌బాస్ ఫేమ్ సోహెల్ రేయాన్, రూపా కొడవాయూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ఈ నెల 18న థియేటర్లలో విడుదల కానుంది. అన్నపరెడ్డి అప్పరెడ్డి, వెంకట్ అప్పిరెడ్డి నిర్మాతలు కాగా శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహించారు. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. సుహాసిని, రాజారవీంద్ర, బ్రహ్మాజీ తదితరులు ఇతర తారాగణం మైక్ మూవీస్ బ్యానర్‌పై ‘జార్జిరెడ్డి’ వంటి ప్రయోగాత్మక సంచలనం చిత్రంపాటు వినోదం, ఆలోచన కలగలసిన ‘ప్రెజర్ కుకర్’, ‘స్లమ్‌డాగ్ హస్బెండ్’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. గ్రామీణ జీవితాన్ని, మట్టితో మనుషుల అనుబంధాన్ని అద్భుతంగా చూపే ‘మట్టికథ’ మూవీ త్వరలో విడుదల కానుంది.

Tags:    

Similar News