AR Rahaman : చనిపోయిన సింగర్స్ వాయిస్‌తో సాంగ్..రెహమాన్ సరికొత్త ప్రయోగం

Update: 2024-01-31 03:07 GMT

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగాయి. ఏఐ టూల్‌తో చాలా మంది సంచలనాలను సృష్టిస్తున్నారు. ఆ టెక్నాలజీతో ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. కొంతమంది అయితే ఆ ఏఐ టూల్‌ను చెడుకు ఉపయోగిస్తున్నారు. అయితే ఏఐ టూల్ వాడి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఓ సరికొత్త ప్రయోగం చేశాడు. చనిపోయిన ఇద్దరు సింగర్ల వాయిస్‌లను ఏఐ టూల్‌తో బతికించాడు.

రజినీకాంత్, విష్ణు విశాల్ హీరోలుగా ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో లాల్ సలామ్ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ ఫిబ్రవరి 9వ తేదిన విడుదల కానుంది. ఈ మూవీలో తిమిరి ఎళుదా..అనే సాంగ్‌ను గతంలో మరణించిన సింగర్లు బంబా బక్యా, షాహుల్ హమీద్ వాయిస్‌లతో పాడించారు. తమిళ్‌లో సింగర్ బంబా బక్యా ఎన్నో సాంగ్స్ పాడారు. ఆయన గత ఏడాదే మరణించారు. మరో సింగర్ షాహుల్ హమీద్ 1997లో చనిపోయారు.

ఇప్పుడు వారిద్దరి వాయిస్‌లను ఏఐ టూల్ సాయంతో మళ్లీ క్రియేట్ చేశారు. టైం లెస్ వాయిస్ అనే సంస్థ సహకారంతో వారి వాయిస్‌లను క్రియేట్ చేసి లాల్ సలామ్ సినిమాలో పాట పాడించారు. ఈ విషయాన్ని సోనీ మ్యూజిక్ అధికారికంగా వెల్లడించింది. దీనిపై ఏఆర్ రెహమాన్ స్పందిస్తూ..గాయకుల కుటుంబం నుంచి పర్మిషన్ తీసుకున్నాకనే వారి వాయిస్‌తో పాట చేసినట్లుగా చెప్పారు. వారికి కొంత రెమ్యునరేషన్ కూడా ఇచ్చినట్లు తెలిపారు. సంగీతంలో ఇదొక సాంకేతిక విప్లవం అని రెహమాన్ అన్నారు.


Tags:    

Similar News