ఆ గ్యారెంటీ లేదు..అందుకే పెళ్లికి దూరంగా ఉన్నా..హీరోయిన్ సదా

Update: 2023-07-12 07:29 GMT

వెళ్లవయ్య వెళ్లూ అంటూ తొలి చిత్రం జయంతోనే అందరి మనసులను దోచేసిన నటి సదా. ఈ సినిమాతో అమ్మడికి క్రేజ్ మామూలుగా రాలేదు. వరుసపెట్టి దక్షిణాది చిత్ర పరిశ్రమల నుంచి మంచి ఆఫర్లు ఈ బ్యూటీకి వచ్చాయి. తెలుగు, తమిళం, మలయాళం చిత్రాల్లో నటించి సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. తమిళ సినిమా అపరిచితుడు సూపర్ హిట్ కావడంతో అమ్మడికి ఒక్కసారిగా స్టార్ ఇమేజ్‎ సొంతం అయ్యింది. అప్పట్లో ఏ ఇండస్ట్రీలో అయినా సదా పేరు గట్టిగానే వినిపించేది. కానీ ఆ తరువాత ఏమైందో ఏమోకానీ సదాకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. తెరకు దూరమైంది. గత కొన్నేళ్లుగా బుల్లితెరమీద రియాల్టీ షోలలో సందడి చేస్తోంది సదా. ఈ క్రమంలో మరోసారి హీరోయిన్ గా సత్తా చాటాలని సెకండ్ ఇన్నింగ్స్ కూడా షురూ చేసింది.

ఓ వైపు బుల్లితెరపైన డ్యాన్స్ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూనే , మరోవైపు సినిమాల్లో నటిస్తున్న సదా వేగన్ రెస్టారెంట్‎ను కూడా హైదరాబాద్ లో నిర్వహిస్తోంది. ఇవి చాలవన్నట్లు తన అభిమానులను పలకరించేందుకు సదే ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‎గా ఉంటుంది . నిత్యం రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. అంతే కాదు ఈ అమ్మడికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగానే ఉంది. అయితే ఇదిలా ఉంటే సదా ఇంత వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అన్న విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు. మూడుపదుల వయసు దాటిపోతున్న అమ్మడికి పెళ్లిపై పెద్దగా ఇంట్రెస్ట్ లేదనే చెప్పాలి.

తాజాగా సదా ఓ ఇంటర్వ్యూలో తాను ఎందుకు పెళ్లి చేసుకోలేదో వివరణ ఇచ్చింది. " నేను పెళ్లి చేసుకోలేదు కాబట్టే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎవరిమీద ఆధారపడకుండా నాకు నచ్చినట్లు ఉండే విధంగా నాకు కావాల్సినంత ఫ్రీడమ్ ఉంది. నాకు పచ్చని మొక్కలు, వైల్డ్ లైఫ్ అంటే కూడా చాలా ఇష్టం. జంతువులను ప్రేమించడం మరింత ఇష్టం. పెళ్లి చేసుకుంటే వాటితో గడిపే సమయం దొరకదు. మనల్ని అర్ధం చేసుకునే వారు వస్తారన్న గ్యారెంటీ లేదు. పైగా ఇప్పుడు పెళ్లి చేసుకున్న వారంతా కొన్నాళ్లకే డివోర్స్ తీసుకుంటున్నారు. అలాంటప్పుడు నేను పెళ్లి చేసుకోకపోవడమే బెటర్ కదా" అంటూ సదా తాను పెళ్లిచేసుకోకపోవడానికి గల కారణాన్ని చెప్పుకొచ్చింది.



Tags:    

Similar News