సౌత్ సినిమా గొప్పేమీ కాదు..అమితాబ్ షాకింగ్ కామెంట్స్

Update: 2024-01-28 14:45 GMT

ఇండియన్ సినిమా అంటేనే హిందీ సినిమా అని, బాహుబలి మూవీ తర్వాత సౌత్ సినిమాల హవా పెరిగిందని బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ అన్నారు. కంటెంట్ ఉంటే చాలు భాషాబేధం లేకుండా ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారన్నారు. బాహుబలి2 తర్వాత పాన్ ఇండియా సినిమాలు ఎక్కువయ్యాయన్నారు. కేజీఎఫ్, సాహో, పుష్ప, కేజీఎఫ్2, కాంతార, కార్తికేయ2, హనుమాన్ వంటి సినిమాలు బాలీవుడ్‌లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ హీరోల మూవీస్ అంతగా ఆడలేదు. సౌత్ చిత్రాలు మాత్రం బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టాయి.

సౌత్ సినిమాల హవాను చూసి బాలీవుడ్ పని అయిపోయిందని, సౌత్ సినిమాలు హిందీ చిత్రాలను డామినేట్ చేస్తున్నాయనే చర్చ ప్రారంభమైంది. ఆ అభిప్రాయాన్ని లెజెండరీ హీరో అమితాబ్ బచ్చన్ ఖండిస్తూనే కీలక వ్యాఖ్యలు చేశారు. అమితాబ్ మాట్లాడుతూ.. వాస్తవ ఘటనలు సినిమాలకు కథలుగా స్ఫూర్తినిస్తాయన్నారు. ఈ మధ్యనే ప్రాంతీయ భాషా చిత్రాలు ఆదరణ పొందుతున్నాయన్నారు. వేషధారణ మార్చడంతో ప్రేక్షకులు అద్భతమని భావిస్తున్నారన్నారు. బాలీవుడ్ చిత్రాలను చూసే తాము సౌత్ సినిమాలు తెరకెక్కిస్తున్నామని టాలీవుడ్ దర్శకులు చెబుతున్నారన్నారు.

దీవార్, శక్తి, షోలే వంటి సినిమాలను చూసి స్ఫూర్తిపొందుతున్నట్లు కొందరు సౌత్ డైరెక్టర్లు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే మలయాళ, తమిళ సినిమాలు వాటికవే ప్రత్యేకంగా ఉంటాయని అమితాబ్ అన్నారు. అలాగని బాలీవుడ్ కంటే సౌత్ ఇండస్ట్రీ అంత గొప్పదని చెప్పడం సరికాదన్నారు. ప్రస్తుతం అమితాబ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమితాబ్ ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న కల్కి 2829 AD మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

Tags:    

Similar News